Begin typing your search above and press return to search.

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

కత్రినా కైఫ్ తన వ్యాపార బాధ్యతలు, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో భర్త విక్కీ కౌశల్ ఎంతో అండగా ఉంటారని తెలిపారు. రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలని, సెలవుల్లో పనికి దూరంగా ఉండాలని విక్కీ సూచిస్తుంటారని వెల్లడించారు. తన ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించే వ్యక్తి భర్తేనని కత్రినా ప్రశంసించారు.

By:  Srikanth Kontham   |   15 Nov 2026 3:15 PM IST
అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!
X

క‌త్రినా కైఫ్-విక్కీ కౌశ‌ల్ దాంప‌త్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తూనే మ‌రోవైపు వృత్తిప‌రంగానూ అంతే బిజీగా కొన‌ సాగుతున్నారు. క‌త్రినా అద‌నంగా మామ్ బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో ఆమె షెడ్యూల్ మ‌రింత బిజీగా ఉంది. అయినా సినిమాల‌కు మాత్రం రెస్ట్ ఇవ్వ‌డం లేదు. అలాగే వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. క‌త్రినా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కే బ్యూటీ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్నారు.

ఈ బిజినెస్ జర్నీలో క‌త్రినా ఎదుర్కొంటున్న సవాళ్లు..భర్త విక్కీ కౌశల్ పోషిస్తున్న కీలక పాత్ర గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. `వ్యాపారం కోసం గంటలు లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఇష్టపడి చేసినప్పుడు అలసట తెలియదని కత్రినా పేర్కొన్నారు. అయితే విక్కీ కౌశల్ మాత్రం తన ఆరోగ్యం.. విశ్రాంతి గురించి ఎప్పుడూ ఓ కంట కనిపెట్టే ఉంటారన్నారు. రేయింబ‌వ‌ళ్లు పనిలో నిమగ్నమైనప్పుడు ఇంక ఫోన్ పక్కన పెట్టేయ్ అంటూ విక్కీ హెచ్చరిస్తుంటాడన్నారు.

రాత్రి బెడ్ మీద ప‌డుకున్న స‌మ‌యంలో పోన్ చూస్తే విక్కీకి అస్స‌లు న‌చ్చ‌ద‌న్నారు. అలా చేస్తే గ‌నుక సీరియ‌స్ గా వార్నింగ్ ఇస్తాడ‌న్నారు. ఆ విష‌యంలో మాత్రం ఊపేక్షించ‌డ‌న్నారు. సెల‌వులు దొర‌కిన‌ప్పుడు వాటిని ఆస్వాదిం చాలి త‌ప్ప వారాంతాల్లో కూడా వ్యాపారాల గురించి మాట్లాడితే విక్కీకి చికాకుగా ఉంటున్న‌ద‌న్నారు క్యాట్.ఒక నటిగా.. వ్యాపారవేత్తగా.. గృహిణిగా ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న తల్లినీగా అన్నింటినీ ఒకేసారి సమన్వయం చేసుకోవడం కష్టమే అయినా? ఆ ప్రయాణాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని కత్రినా స్పష్టం చేశారు.

కొన్నిసార్లు రోజు చివరిలో తీవ్రమైన అలసట.. ఒత్తిడి ఎదురవుతుంటాయని అయినా? భర్త విక్కీ కౌశల్ ఇస్తున్న మానసిక స్థైర్యమే ఉరుకులు పరుగులకు అసలైన ఉపశమనమ‌ని కొనియాడారు.`నాలోని ఆందోళనలను.. హడావుడిని ప్రశాంతతగా మార్చే అద్భుతమైన శక్తి నా భర్త విక్కీ సొంతం. ఆయన నా హిస్టీరియాకు సరైన శాంతి లాంటివారు` అంటూ విక్కీపై ప్రేమ.. గౌరవాన్ని చాటుకున్నారు.

వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ బిజీగా ఉన్నా? ఒకరికొకరు ఇచ్చే మానసిక మద్దతే తమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని క‌త్రినా వెల్లడించారు. జీవితంలో ఎన్ని బాధ్యతలున్నా? భాగస్వామి అందించే చేయూత ఉంటే ఏ రంగంలోనైనా తిరుగులేని విజయాలు సాధించొచ్చ‌ని కత్రినా ప్రయాణం నిరూపిస్తోంది. భర్త ఇచ్చే ప్రశాంతత..తనకున్న ప్యాషన్‌తో విజయపథంలో దూసుకెళ్తున్న‌ కత్రినా భ‌విష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సంద‌ర్భంగా అభిమానులు కోరుకుంటున్నారు.