పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా- విక్కీ
బాలీవుడ్ జంటలు రీసెంట్ గా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల పరిణీతి చోప్రా మగబిడ్డకు జన్మనివ్వగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Nov 2025 3:22 PM ISTబాలీవుడ్ జంటలు రీసెంట్ గా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల పరిణీతి చోప్రా మగబిడ్డకు జన్మనివ్వగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఈ ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. బాబు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ, తమ జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చిందని, మా జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్న మిరాకల్ కు మీ ఆశీస్సులు కావాలని పోస్ట్ చేస్తూ తమ సంతోషాన్ని వెల్లడించారు.
సెప్టెంబర్ లో ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్
ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు విక్కీ, కత్రినాకు విషెస్ విషెస్ చెప్తూ పోస్టులు చేస్తుండగా, ఈ ఇయర్ సెప్టెంబర్ లో కత్రినా, విక్కీ తమ మొదటిబిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించారు. కత్రినా ప్రెగ్నెంట్ అనే వార్త ఎంతోమంది అభిమానులకు సంతోషాన్నివ్వగా, కత్రినా బేబీ బంప్ ఫోటోలను కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
2021లో పెళ్లి చేసుకున్న కత్రినా, విక్కీ కౌశల్
రెండేళ్ల పాటూ డేటింగ్ చేసిన తర్వాత విక్కీ కౌశల్, కత్రినా 2021లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకు వీరికి ఇప్పుడు మగబిడ్డ జన్మించాడు. కాగా ఈ ఇయర్ విక్కీకు చాలా స్పెషల్ గా మారింది. ఆల్రెడీ ఛావా మూవీతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న విక్కీ కౌశల్ ఇప్పుడు తన లైఫ్ లోనే మొదటిసారిగా తండ్రిగా మారారు.
ఇక కెరీర్ విషయానికొస్తే విక్కీ కౌశల్ తన తర్వాతి సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్నారు. లవ్ అండ్ వార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఇక కత్రినా కైఫ్ విషయానికొస్తే ఆమె ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. కత్రినా ఆఖరిగా 24లో విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ మూవీలో కనిపించారు.
