Begin typing your search above and press return to search.

క‌త్రిన కొడుక్కి పేరు పెడితే 'దురంధ‌ర్' రియాక్ట‌య్యాడు?

విక్ కాట్ త‌మ బిడ్డ‌ను ప‌రిచ‌యం చేస్తూ సోష‌ల్ మీడియాలో ఇలా రాసారు. విహాన్ కౌశల్ రాక‌తో జీవితం అందంగా ఉంది. మా ప్రపంచం క్షణంలో మారిపోయింద‌ని రాసారు. ఈ పోస్ట్ కి ఆదిత్యాధ‌ర్ రిప్ల‌య్ ఇచ్చారు.

By:  Sivaji Kontham   |   9 Jan 2026 8:00 AM IST
క‌త్రిన కొడుక్కి పేరు పెడితే దురంధ‌ర్ రియాక్ట‌య్యాడు?
X

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ తమ మొదటి బిడ్డను స్వాగ‌తించిన సంగ‌తి తెలిసిందే. ఈ అంద‌మైన‌ జంటకు మగబిడ్డ పుట్టాడు. విహాన్ కౌశ‌ల్ ఈ బిడ్డ పేరు. జనవరి 7 నాటికి విహాన్ కి రెండు నెలల వ‌య‌స్సు. ఈ సంద‌ర్భంగా విక్కీ- కత్రినా చిన్నారి చేతుల‌ను ఫ్యామిలీ ఫోటోతో అభిమానులకు పరిచయం చేశారు.

విహాన్ అనే పేరును ప్ర‌క‌టించ‌డ‌మే గాక‌.. ఈ పేరును ఎంపిక చేయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం తెలిపారు. దీనికి విక్కీ న‌టించిన `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్` (2019)తో క‌నెక్ష‌న్ ఉంది. ఈ సినిమాలో విక్కీ పాత్ర మేజర్ విహాన్ షెర్గిల్. దీని నుంచి విహాన్ పేరును సెలెక్ట్ చేసుకున్నారు. యూరి చిత్రం విక్కీ కౌశ‌ల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం. దీనికి ఆదిత్యాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అందుకే ఇప్పుడు విక్కీ కుమారుడికి విహాన్ అనే పేరు పెట్ట‌గానే `యూరి` దర్శకుడు ఆదిత్య ధ‌ర్ వెంట‌నే స్పందించారు.

విక్ కాట్ త‌మ బిడ్డ‌ను ప‌రిచ‌యం చేస్తూ సోష‌ల్ మీడియాలో ఇలా రాసారు. విహాన్ కౌశల్ రాక‌తో జీవితం అందంగా ఉంది. మా ప్రపంచం క్షణంలో మారిపోయింద‌ని రాసారు. ఈ పోస్ట్ కి ఆదిత్యాధ‌ర్ రిప్ల‌య్ ఇచ్చారు. విక్కీ - క‌త్రిన‌కు అభినందనలు. మేజర్ విహాన్ షెర్గిల్‌ తెరపై ప్రాణం పోసుకోవడం మొద‌లు ఇప్పుడు చిన్న విహాన్‌ను మీ చేతుల్లో పట్టుకోవడం వరకు, జీవితం నిజంగా ఒక పూర్తి స‌ర్కిల్ లోకి వచ్చింది. మీ ముగ్గురికి నా ప్రేమ ఆశీస్సులు.. అని రాసారు.

ఆదిత్య ధర్ తో పాటు చాలా మంది ప్రముఖులు విక్ కాట్ ని అభినందిస్తూ కుమారుడు వివాన్ పై ప్రేమ‌ను కురిపించారు. బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్, రితేష్ దేశ్ ముఖ్‌,ఆలియా భ‌ట్, ఫ‌రాఖాన్ కూడా విక్ కాట్జంట‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, విక్కీ తదుపరి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ & వార్‌`లో అలియా-రణబీర్ కపూర్‌లతో కలిసి కనిపిస్తాడు.