వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత
పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య, దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వెట్టువమ్ మేకింగ్ వీడియో విడుదలైంది. భారీ విలేజ్ సెట్, వందలాది మందితో యాక్షన్ సీన్లు, పేలుళ్లు ఆకట్టుకున్నాయి. శోభితా ధూళిపాళ్ల రగ్గడ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం సంక్రాంతి 2027 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
By: M Prashanth | 9 Nov 2026 4:33 PM ISTరెండు భిన్నమైన వర్గాల మధ్య జరిగే ఆధిపత్య పోరును సహజంగా తెరకెక్కించడంలో దర్శకుడు పా. రంజిత్ రూటే వేరు. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వెట్టువమ్. ఆర్య, దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి సెలబ్రేట్ రెసిలియెన్స్ పేరుతో మేకర్స్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. చిన్న గ్లింప్స్‌తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో క్లియర్ కట్ హింట్ ఇచ్చారు.
ఈ వీడియోలో చూపించిన మేకింగ్ షాట్స్ ప్రాజెక్ట్ చూస్తుంటే గ్రాండ్ స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఒక పెద్ద విలేజ్ సెట్ నడుమ వందలాది మందితో ప్లాన్ చేసిన భారీ కొట్లాటలు, గాల్లోకి లేచే కార్లు, బ్లాస్టింగ్లు చూస్తుంటే ఫుల్ యాక్షన్ డ్రామా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పా. రంజిత్ స్వయంగా మైక్ పట్టుకుని సీన్లను లీడ్ చేయడం, దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన రియలిస్టిక్ స్టంట్స్ విజువల్స్ లో మంచి ఇంటెన్సిటీ తీసుకొచ్చాయి.
వీడియోలో హీరోల లుక్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. గోధుమ రంగు షర్ట్, గాగుల్స్‌తో మాస్ లీడర్లా నడిచివచ్చే ఆర్య, మరో సీన్లో తెల్లటి దుస్తుల్లో చేతిలో గన్ పట్టుకుని నిలబడే ఫ్రేమ్స్ అదిరిపోయాయి. మరోవైపు గడ్డంతో ఫుల్ రగ్గడ్ అవతారంలో కనిపించిన దినేష్ ఎనర్జీ కూడా చాలా రాగా ఉంది. వీరిద్దరి పాత్రల మధ్య నడిచే క్లాష్ తెరపై అసలైన థ్రిల్ ఇచ్చేలా కనిపిస్తోంది.
ఈ గ్లింప్స్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకున్న అంశం శోభితా ధూళిపాళ్ల ప్రెజెన్స్. సాధారణంగా గ్లామరస్ పాత్రల్లో కనిపించే శోభిత, ఇందులో పూర్తి డీగ్లామరైజ్డ్ రగ్గడ్ రోల్లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆమె వేసిన మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ పోజ్, కళ్లలో చూపించిన ఇంటెన్సిటీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కథానాయికగానే పరిమితం కాకుండా, ఒక బలమైన పోరాట యోధురాలి తరహా పాత్రను ఎంచుకుని శోభిత తన నటనలోని కొత్త కోణాన్ని చూపిస్తోందనే నమ్మకం కలుగుతోంది.
సాంకేతిక విభాగం కూడా సినిమాకు పెద్ద బలంగా నిలిచేలా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోలోని హై మూమెంట్స్‌కు తగ్గట్టు అదిరిపోయే బీట్స్ ఇచ్చింది. నీలమ్ ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ సంస్థలు ఎక్కడా వెనక్కి తగ్గకుండా విజువల్స్‌ను రిచ్‌గా నిర్మించాయి. రూబేష్ షాజీ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ఇక వెట్టువమ్ మేకింగ్ గ్లింప్స్ ఒక భారీ రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమా రాబోతోందనే హింట్ ఇచ్చింది. సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే రిలీజ్ చేసిన ఈ వీడియో మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
