Begin typing your search above and press return to search.

ధనుష్ తర్వాత ఎన్టీఆర్.. వెట్రిమారన్ సూపర్ స్కెచ్..!

కోలీవుడ్ లో రా అండ్ రస్టిక్ సినిమాలు చేసే దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. ఆయన చేసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేసే సందడి కన్నా ప్రేక్షకుల మధ్య ఎక్కువ డిస్కషన్ జరిగేలా చేస్తుంది.

By:  Ramesh Boddu   |   3 Sept 2025 2:00 PM IST
ధనుష్ తర్వాత ఎన్టీఆర్.. వెట్రిమారన్ సూపర్ స్కెచ్..!
X

కోలీవుడ్ లో రా అండ్ రస్టిక్ సినిమాలు చేసే దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. ఆయన చేసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేసే సందడి కన్నా ప్రేక్షకుల మధ్య ఎక్కువ డిస్కషన్ జరిగేలా చేస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో కథ కథనాలు నిజ జీవితానికి అద్దం పట్టినట్టుగా ఉంటాయి. సినిమా కోసం లార్జర్ దాన్ లైఫ్ చూపించే దర్శకులు కొదరైతే.. సినిమా తీసేదే జనాల్లో ఆలోచన మొదలు పెట్టడానికి అన్నట్టుగా వెట్రిమారన్ సినిమాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరో పాత్రల్లో ఉండే సహజత్వం.. క్యారెక్టరైజేషన్ చూసి ఆడియన్స్ వావ్ అనేస్తారు.

కోలీవుడ్ లో ప్రత్యేకమైన డైరెక్టర్..

అందుకే కోలీవుడ్ లో ఆయన ప్రత్యేకమైన డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఐతే రీసెంట్ గా వెట్రిమారన్ తన ప్రొడక్షన్ లో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఐతే నిర్మాతగా తన కెరీర్ ని ముగించేశార్ వెట్రిమారన్. తన ప్రొడక్షన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా అందుకే ఇక ప్రొడక్షన్ ని ఆపేస్తున్నా అని చెప్పారు వెట్రిమారన్. తన ఫోకస్ అంతా కూడా మేకింగ్ మీద దృష్టి పెడతా అని అంటున్నారు.

ఈ క్రమంలో తను తీయాలనుకున్న సినిమాల మీద డిస్కషన్ మొదలైంది. ఆమధ్య దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తమిళ్ లో వెట్రిమారన్ డైరెక్షన్ లో సినిమా చేస్తానని ప్రత్యేకంగా చెప్పాడు. అందుకు వెట్రిమారన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తన పేరు చెప్పడంపై వెట్రిమారన్ సంతోపడ్డారు. ఐతే ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సినిమా చేసినా చేయొచ్చు అంటునారు ఆడియన్స్.

వెట్రిమారన్ తారక్ సినిమా చర్చలు..

ఎందుకంటే ఎన్టీఆర్ తనంతట తానే స్వయంగా వెట్రిమారన్ తో చేస్తా అన్నాడు కాబట్టి అంచి కథతో వెళ్తే ఓకే చేసేయొచ్చు. అంతకుముందు కూడా వెట్రిమారన్ తారక్ సినిమా చర్చలు జరిగాయి కానీ అప్పుడు ఎందుకో సెట్ అవ్వలేదు. ఐతే ఈసారి మాత్రం వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబో గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

ప్రస్తుతం వెట్రిమారన్ ధనుష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ ఒకవేళ చేస్తే ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేయొచ్చని తెలుస్తుంది. తారక్ తో వెట్రిమారన్ సినిమా పడాలే కానీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ వస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఈ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవర 2 ఉంటుంది. త్రివిక్రం తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఈ కమిట్మెంట్ లు పూర్తయ్యాకే ఎన్ టీ ఆర్ వెట్రిమారన్ సినిమా ఉంటుంది. ఐతే ఈ కాంబో ఎప్పుడు వచ్చినా సరే సంథింగ్ స్పెషల్ గా నిలిచే ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.