Begin typing your search above and press return to search.

వెట్రిమారన్ తో కోలీవుడ్ కల్ట్ డైరెక్టర్.. ఏంటి మ్యాటర్?

ఇప్పటికే వరకు కెరీర్ లో ఐదు నేషనల్ అవార్డులు అందుకుని సత్తా చాటిన వెట్రిమారన్ తో దాదాపు వర్క్ చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు.

By:  M Prashanth   |   16 Oct 2025 4:22 PM IST
వెట్రిమారన్ తో కోలీవుడ్ కల్ట్ డైరెక్టర్.. ఏంటి మ్యాటర్?
X

కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి అందరికీ తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి, వారి సమస్యలను సినిమాల రూపంలో తెరకెక్కిస్తుంటారు. సామాజిక నేపథ్యం, హ్యూమన్ ఎమోషన్స్ లోతుగా ఆవిష్కరించే అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వాస్తవితకు దగ్గరగా ఉండే సినిమాలు తీస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాలు అందుకుంటున్నారు.

ఇప్పటికే వరకు కెరీర్ లో ఐదు నేషనల్ అవార్డులు అందుకుని సత్తా చాటిన వెట్రిమారన్ తో దాదాపు వర్క్ చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తారక్ పలుమార్లు తెలిపారు. వివిధ సందర్భాల్లో మనసులోని కోరికను వెలిబుచ్చారు. ఆ మధ్య ఓ స్క్రిప్ట్ విషయంలో చర్చలు జరిగినట్లు టాక్ వచ్చింది.

కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తారక్ - వెట్రిమారన్ కాంబోలో ఫ్యూచర్ లో మూవీ తప్పకుండా వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వెట్రిమారన్ కోసం రంగంలోకి దిగారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు మద్దతు తెలుపుతున్నారు.

వెట్రిమారన్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అరసన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ.. చాలా కాలంగా వార్తల్లో ఉండగా.. ఇటీవల మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ టైటిల్‌ ను ఫిక్స్ చేసి... ఇంటెన్స్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. వెట్రిమారన్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ ఉండనుందని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు. అరసన్ మూవీ ప్రోమోను శుక్రవారం లాంచ్ చేయనున్నారు. అయితే అరసన్ మూవీ తెలుగులో సామ్రాజ్యం టైటిల్ లో విడుదల కానుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించారు. తెలుగు ప్రోమోను తారక్ అక్టోబర్ 17 ఉదయం 10:07 గంటలకు ఆవిష్కరిస్తారని మేకర్స్ తెలిపారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. తెలుగు ప్రోమోకు తారక్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్.. ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్ షా మూవీలో శింబు.. ఓ మై డైమండ్ గర్ల్ సాంగ్ పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు శింబు సినిమాకు తెలుగులో తారక్ మద్దతుగా నిలిచారు.