'వడ చెన్నై' లో వెట్రీ మారన్ రాసిన ఆ సీన్ కి ఫిదా అయిపోయిన స్టార్ హీరోలు...
ధనుష్ హీరోగా వెట్రీ మారన్ తెరకెక్కించిన ‘వడ చెన్నై’ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచింది. క్యారమ్ ఆటను కథలో కీలక అంశంగా మలిచి, హీరో క్యారెక్టరైజేషన్ నుంచే కొత్త కాన్ఫ్లిక్ట్ను సృష్టించారు. వెట్రీ మారన్ రైటింగ్, మేకింగ్‌కు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అభిమానులని, అవకాశం వస్తే ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కథనం పేర్కొంది.
By: Gopi Velupala | 22 Nov 2026 5:29 AM ISTధనుష్ హీరోగా వెట్రీ మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వడ చెన్నై' సినిమా క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. అప్పటివరకు ఎన్ని గ్యాంగ్ స్టర్ మూవీస్ వచ్చినా కూడా ఇది డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు... వెట్రీ మారన్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ధనుష్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం...ఈ సినిమాతోనే వెట్రీ మారన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇతర భాషల దర్శకులు సైతం ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని కథలను రాసుకున్నారు అంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు...ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?
డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్...
భారీ ఎలివేషన్స్ ఉంటేనే హీరోయిజం అని నమ్మే రోజుల్లో వెట్రీ మారన్ సింపుల్ పాయింట్ తో 'వడ చెన్నై' మూవీ చేసి హీరోయిజాన్ని కొత్తగా చూపించారు. ఈ సినిమాలో క్యారమ్ బోర్డు ఆట తో కూడా కథను మలుపు తిప్పవచ్చు అని ప్రూవ్ చేశారు. కాన్ఫ్లిక్ట్ కొత్తగా రాయాలంటే ఎక్కడి నుంచో తీసుకువచ్చి రాయాల్సిన పని లేదు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నుంచి కూడా రాయవచ్చు అని రాసి చూపించిన దర్శకుడు వెట్రీ మారన్... సినిమా కథ పరంగా చూసుకుంటే క్యారమ్ బోర్డు ఆట అంటే ఇష్టం ఉన్న ధనుష్ దానిలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. క్యారమ్ బోర్డు లో కాయిన్ ఏ మూలన ఉన్న స్ట్రైకర్ అతని చేతిలో ఉంటే ఆ కాయిన్ ను రింగ్ లో పడేస్తాడు. అంత గొప్ప నైపుణ్యం ఉన్న తను ఒక పని మీద జైలు కి వెళ్తాడు. అక్కడ క్యారమ్ బోర్డు కాంపిటీషన్ పెడతారు. అందులో ధనుష్ కి మంచి నైపుణ్యం ఉంది కాబట్టి తను కూడా ఆడతాడు.
అదే సమయంలో ధనుష్ కి ఎవరైతే ఆడడానికి అవకాశం కల్పిస్తాడో అలాగే జైలు లో ఆ కాంపిటీషన్ నిర్వహిస్తున్న రౌడీ ని చంపేస్తాడు. అయితే తను జైలుకి ఎందుకు వచ్చాడనేది అప్పటి దాకా సస్పెన్స్ గా ఉంచి ఒక్కసారిగా రివీల్ చేస్తాడు. అది కూడా ధనుష్ వాళ్లను చంపాడనే విషయం తెలియకుండా టెంట్ కూలిపోయేలా చేసి ఆ లోపల రౌడీ ని చంపేస్తాడు. అలా ఆ రౌడీ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఒక చిన్న ఆట ను కూడా సినిమాలో భాగం చేసి రాయవచ్చు అని ప్రూవ్ చేశాడు...ఆయన రైటింగ్, మేకింగ్ కి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు పెద్ద ఫ్యాన్స్... అన్ని కుదిరితే వెట్రీ మారన్ తో సినిమా చేయడానికి వాళ్ళు సిద్ధం గా ఉన్నారు...
