వెట్రీ మారన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? రాజమౌళి ని సైతం మెప్పించాడా...
వెట్రీ మారన్ సినిమాల్లో వరల్డ్ బిల్డింగ్ అనేది సూపర్ గా ఉంటుంది. అతను ఏ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాడో దాని చుట్టూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు.
By: Gopi Velupala | 4 Oct 2026 10:37 AM ISTకొంతమంది దర్శకులు చేసే సినిమాలు రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపే కాకుండా మూవీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. ఇక అలాంటి కోవకు చెందిన దర్శకుడు వెట్రీ మారన్... ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి... రాజకీయ వ్యవస్థ, పోలీస్ ల అణిచివేత సమాజంలో కుల వ్యవస్థ ఎలా ఉంటుంది అనే పాయింట్స్ ను బేస్ చేసుకొని ఆయన సినిమాలను చేస్తుంటాడు. ఆయన సినిమాల్లో ఎలివేషన్ సన్నివేశాలు కావాలని రాసుకున్నట్టుగా ఉండదు. పరిస్థితులను బట్టి అందులోనుంచి ఎలివేషన్ సీన్స్ అయితే పుడుతుంటాయి. ఇలాంటి క్రమంలోనే వెట్రి మారన్ లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద తన మార్క్నైతే చూపించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీలకు సైతం వెట్రీ మారన్ సినిమాలంటే అమితమైన ఇష్టమంటూ పలు సందర్భాల్లో వాళ్ళు బహిరంగంగా చెప్పడం విశేషం...
వెట్రీ మారన్ ఎందుకంత స్పెషల్
ఒక కథ కోసం ఆయన తీసుకునే సెటప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా రిలేటెడ్ గా ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ లను బిల్డ్ చేసుకుంటాడు. అణిచివేతకు గురైన కొంతమంది వ్యక్తుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని ఆయన సినిమాలను చేస్తుంటారు. 'విసరనై' సినిమాలో పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపించారు. 'అసురన్' మూవీలో సమాజంలో కుల వ్యవస్థ ఎలా ఉంది. తక్కువ కులం వాళ్ళు ఎలాంటి వివక్షులు ఎదుర్కుంటున్నారు. పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళని ఎలా తొక్కేస్తున్నారు అనే పాయింట్ ను కూడా ఈ సినిమాలో ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యే విధంగా చాలా క్లారిటీగా చూపించాడు. 'వడ చెన్నై' సినిమాలో గ్యాంగ్ స్టర్ ఎలా ఉంటారు. మారుతున్న కాలంలో వాళ్ళు ఎలా రూపాంతరం చెందుతున్నారు.గ్యాంగ్ స్టర్స్ గా మారడానికి గల కారణాలేంటి అనే విషయాలను కూడా ఈ సినిమాలో చాలా స్పష్టంగా తెలియజేశారు...
వరల్డ్ బిల్డింగ్
వెట్రీ మారన్ సినిమాల్లో వరల్డ్ బిల్డింగ్ అనేది సూపర్ గా ఉంటుంది. అతను ఏ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాడో దాని చుట్టూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్లు కూడా ఆ పరిధిని దాటి బయటికి వెళ్ళవు. ఎక్కడా కూడా క్యారెక్టర్ చేసే యాక్టింగ్ మనకు అతిగా అనిపించదు. వాటన్నింటినీ అందులో పర్ఫెక్ట్ గా పొందుపరిచి సినిమాని ప్రేక్షకుడికి అందించే ప్రయత్నం చేస్తాడు అందుకే ఆయన క్యారెక్టర్లన్ని ప్రేక్షకులకు సినిమా చూసిన తర్వాత కూడా గుర్తుండిపోతాయి... ఇక మేకింగ్ విషయంలో కూడా ఆయన అనవసరమైన హంగులు ఆర్భాటాలకు వెళ్లడు. నాచురల్ లైటింగ్ లో చాలా రియలెస్టిక్ గా సన్నివేశాలను చిత్రీకరిస్తుంటాడు. అందుకే అతని సినిమాలు రా అండ్ రస్ట్రీక్ గా కనిపిస్తుంటాయి... ఆయన సినిమాల్లోని క్యారెక్టర్లు మంచివారు, చెడ్డవారు అని ఏమీ ఉండదు. కేవలం ఆ క్యారెక్టర్లు ప్రవర్తించే తీరును బట్టి వాళ్ల వెనుక ఏదో బలమైన కారణం అయితే ఉండే ఉంటుంది. అందుకే వాళ్ళు మంచివారులా నటించడం లేదంటే చెడ్డవారిగా మారిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు సైతం వెట్రీ మారన్ సినిమాల్లో ఒక రియాల్టీ ఉంటుందని అతని సినిమాలు చూస్తున్నంత సేపు రా నెస్ అనేది మనకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుందని మేకింగ్ విషయంలో గాని షాట్స్ కంపోజ్ చేసే విషయంలో గానీ తను చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేస్తూ ఉంటాడని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. మొత్తానికైతే రాజమౌళి మనసు గెలుచుకున్న దర్శకుడిగా వెట్రీ మారన్ నిలవడమనేది నిజం చాలా గొప్ప విషయమనే చెప్పాలి...
