Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డానికి దూసుకొస్తున్న జూనియ‌ర్‌ బెబో

అయితే క‌రీనా త‌ర్వాత క‌పూర్ ఫ్యామిలీ నుంచి అచ్చం అలాంటి లుక్ తో ఎవ‌రైనా ఉన్నారా? బెబో వార‌సురాలిగా అర్హ‌త ఎవ‌రికి ఉంది?

By:  Sivaji Kontham   |   28 Sept 2025 8:30 AM IST
ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డానికి దూసుకొస్తున్న జూనియ‌ర్‌ బెబో
X

అంద‌మైన నీలిక‌ళ్లు, అద్భుత‌మైన‌ చిరున‌వ్వు, ప్ర‌తిభ‌తో బెబో క‌రీనా క‌పూర్ పెద్ద తెర‌పై ఎలాంటి మ్యాజిక్ చేసిందో చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న‌దైన అందం, ఆహార్యంతో కుర్ర‌కారు గుండెల్లో ఈ బ్యూటీ గుబులు పుట్టించింది. సాంప్ర‌దాయ‌ క‌పూర్ కుటుంబం నుంచి మొద‌టిసారి క‌రిష్మా క‌పూర్ క‌థానాయిక‌గా అడుగు పెట్ట‌గా, త‌న సోద‌రి బాట‌లోనే క‌రీనా కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. హిందీ చిత్ర‌సీమ‌లో వేగంగా త‌న ప్ర‌భావం చూపించిన మేటి క‌థానాయిక‌గా క‌రీనా క‌పూర్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. బెబోగా అభిమానుల గుండెల్లో నిదురించింది.

అయితే క‌రీనా త‌ర్వాత క‌పూర్ ఫ్యామిలీ నుంచి అచ్చం అలాంటి లుక్ తో ఎవ‌రైనా ఉన్నారా? బెబో వార‌సురాలిగా అర్హ‌త ఎవ‌రికి ఉంది? అంటే.. ఇప్పుడు దానికి స‌మాధానం దొరికింది. అచ్చు గుద్దిన‌ట్టు డిట్టోగా బెబోలా క‌నిపించే ఒక బ్యూటీ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీ మాట్లాడుకుంటోంది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ప్రీమియర్ లో కెమెరా క‌ళ్లు ఈ అందాన్ని క్యాప్చుర్ చేసాయి.

ముంబైలో జరిగిన ఈ వేడుక‌లో త‌న తండ్రి రజత్ భేడీతో కలిసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ పేరు వెరా భేడీ. వివాన్ అనే సోద‌రుడు త‌న‌కు ఉన్నాడు. వివాన్ కూడా ఇండ‌స్ట్రీలో ప‌ని చేస్తున్నాడు. `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` చిత్రం కోసం ఆర్య‌న్ తో క‌లిసి ప‌ని చేసాడు. ఇప్పుడు వెరా భేడి లుక్స్ చూశాక చాలా మంది క‌రీనా కంటే అందంగా ఉంది! అంటూ కితాబిచ్చారు. నీలి క‌ళ్ల‌తో మాయాజాలం చేస్తోంద‌ని ప్ర‌శంసించారు. అచ్చం క‌రీనాలా క‌నిపిస్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ రెస్పాన్స్ చూశాక ర‌జత్ భేడి ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెరా గురించి ఎంక్వ‌యిరీలు మొద‌ల‌య్యాయని చెప్పాడు. అమెరికా, కెనడా, లండన్, దుబాయ్ అన్ని దేశాల నుంచి ప్రజలు ఫోన్ చేస్తున్నారు అని భేడీ ఆనందం వ్య‌క్తం చేసాడు. వెరా చాలా సింపుల్.. ఎప్పుడూ ఇలాంటివి చూడ‌లేదు. త‌న‌ జీవితంలో తండ్రితో కలిసి రెడ్ కార్పెట్ కార్యక్రమానికి వెళ్లడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.

వివాన్, వెరా ఇద్ద‌రూ సినీప‌రిశ్ర‌మ‌లోకి వ‌స్తారా? అని ప్ర‌శ్నించ‌గా, త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని ర‌జ‌త్ భేడి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వివాన్ ఆరంగేట్రం గురించి ప్లాన్ చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే కొత్త విష‌యం వింటార‌ని అన్నారు. వెరా భేడి కూడా న‌టి అవుతుందా? అన్న ప్ర‌శ్న‌కు.. ఇప్ప‌టివ‌ర‌కూ లేదు.. ఇప్పుడిప్పుడే ఆలోచిస్తోంద‌ని తెలిపాడు. మొత్తానికి బెబో లుక్స్ తో మ‌రో బ్యూటీ బాలీవుడ్ ని షేక్ చేయ‌బోతోంది. అయితే ఇప్పుడే వెరా భేడీ గురించి ఎక్కువ మాట్లాడుకోవ‌డం తొంద‌ర పాటు అవుతుంది. వెరా భేడి న‌ట‌న‌లోకి రాక ముందే అక‌డ‌మిక్ స్ట‌డీస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది.