Begin typing your search above and press return to search.

బలగం డైరెక్టర్ టైమ్ వెస్ట్ చేసుకున్నాడా?

జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన వేణు రెండేళ్ల కిందట బలగం అనే కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు.

By:  M Prashanth   |   12 Oct 2025 6:08 PM IST
బలగం డైరెక్టర్ టైమ్ వెస్ట్ చేసుకున్నాడా?
X

జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన వేణు రెండేళ్ల కిందట బలగం అనే కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీనికి పలు అవార్డులు కూడా దక్కాయి. అలా డైరెక్షన్ లో తొలి సినిమాతోనే తన సత్తా చాటిన వేణు, బలగం వేణుగా మారిపోయారు.

ఇక వేణు తాను తెరకెక్కించబోయే రెండో సినిమా కథ ఇప్పటికే రాసేసుకున్నారు. ఈ సినిమా శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై రూపొందనుంది. దీనికి ఎల్లమ్మ అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే బలగం విజయం సాధించడం, ఈ ప్రాజెక్ట్ కు ఎల్లమ్మ అనే పేరు పెట్టడంతో ఈ చిత్రం కూడా కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ టౌన్ గా అయ్యింది. అయితే కథ రెడీ ఉంది. నిర్మాణ సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సినిమా మాత్రం ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు.

ఇందుకు ప్రధాన కారణం నిర్మాతే అని తెలుస్తోంది. ఎందుకంటే హీరో ఎంపిక ఇంకా కాలేదు. బడ్జెట్ విషయాల్లోనూ కొంత లాగింగ్ ఉంది. అందుకే సినిమా ఇంకా షురూ కాలేదు. వేణు ఎప్పుడో కథ రాసుకున్నారు. అయితే అది ముందుగా నిర్మాత దిల్ రాజు కు చెప్పడంతో ఆయనకు నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో లాక్ అయిపోయింది. కానీ హీరో ఎంపికలో మాత్రం తర్జనభర్జన కావడంతో ఆలస్యం అవుతోంది.

తొలుత ఈ సినిమాను నేచురల్ స్టార్ నానీ హీరోగా చేయనున్నట్లు ప్రచారం సాగింది. అయితే కారణాలు తెలియదు కానీ, నాని ఈ సినిమా చేయడం లేదు. ఆ తర్వాత ఇదే కథను నితిన్ తో చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు స్వయంగా చెప్పారు. ఓ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేసి మరీ నితిన్ హీరోగా కన్ఫార్మ్ అయ్యారని అన్నారు. దాదాపు సెట్స్ పైకి వెళ్తుందన్న టైమ్ కు నితిన్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

దీంతో వేణుకు ఇబ్బందిగా మారింది. ఇలా ఒకరి తర్వాత మరొకరు హీరోలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో వేణు ఆందోళన చెందే పరిస్థితి ఎదురైంది. మరోవైపు వేణు ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నారు? ఇతర బ్యానర్లపై సినిమా చేయొచ్చు కదా అనే వాదనలూ వినిపిస్తున్నాయి. వాస్తవంగా వేణు కూడా కథతో వెళ్తే వేరే నిర్మాతలు చేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ, ముందుగానే దిల్ రాజుతో లాక్ అవ్వడం వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితిలో వేణు పడిపోయారు. ఇక ఇప్పుడు టాప్ హీరోలు సైడ్ అవ్వడంతో టైర్ 2 హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మూవీటీమ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫైనల్ స్టేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి సాయి శ్రీనివాస్ అయినా ఈ ప్రాజెక్ట్ చేస్తారా? లేదంటే ఇంకో హీరోను వెతుకుతారా? చూడాలి.