ఎల్లమ్మ కథ.. ఇది అమ్మోరు నిర్ణయమేనా..?
బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అంటూ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 17 Oct 2025 5:00 PM ISTబలగం తర్వాత వేణు ఎల్లమ్మ అంటూ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. ఐతే ఎల్లమ్మ సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించేది ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ సినిమాలో ఫలానా హీరో అంటూ రకరకాల పేర్లు వినిపించాయి. ముందు ఎల్లమ్మ సినిమాకు నానిని హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు డైరెక్టర్ వేణు. ఆల్రెడీ నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా కాదనాల్సి వచ్చింది.
శర్వానంద్ తో పాటు తమిళ హీరో పేరు కూడా..
ఇక ఎల్లమ్మలో నితిన్ హీరోగా కన్ ఫర్మ్ అనుకున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న టైం లో తమ్ముడు సినిమా ఇచ్చిన షాక్ తో నితిన్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నితిన్ తోనే తమ్ముడు అని ఫిక్స్ అయిన ఆడియన్స్ కి హీరో మార్పులంటూ వచ్చిన వార్తలు షాక్ అయ్యేలా చేశాయి. ఇక శర్వానంద్ తో పాటు తమిళ హీరో పేరు కూడా ఎల్లమ్మకి జత చేస్తూ వార్తలు వచ్చాయి.
ఎల్లమ్మ కథను వేణు ఎంతో కష్టపడి అద్భుతంగా రాసుకున్నారు. ఐతే కథ రాసింది వేణునే అయినా ఈ సినిమాలో ఎవరు నటించాలన్నది మాత్రం అమ్మ వారే ఎంపిక చేసుకుంటారన్నట్టు ఎవరెవరి పేర్లో వినిపించగా ఫైనల్ గా దేవి శ్రీ ప్రసాద్ తెరంగేట్రం సినిమాగా ఇది వస్తుంది. ఎల్లమ్మ ఇది అమ్మ వారి స్క్రిప్ట్ లో భాగమే అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
అమ్మోరే తన సినిమాకు కావాల్సిన కాస్టింగ్ ఎంపిక..
సినిమా అంటే అంతే.. ఒక హీరో కోసం కథ సిద్ధం చేస్తే అది మరో హీరో దగ్గరకు వెళ్తుంది. ఐతే అది రెగ్యులర్ సినిమా అయితే ఆ హీరో బ్యాడ్ లక్ అనేస్తాం. కానీ ఇది అమ్మ వారి కథ కాబట్టి ఇలా అమ్మోరే తన సినిమాకు కావాల్సిన కాస్టింగ్ ఎంపిక క్లియర్ చేస్తుందని అంటున్నారు. బలగం హిట్ ఇచ్చాడు కాబట్టి ఎల్లమ్మ సినిమా విషయంలో వేణుకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు దిల్ రాజు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. సినిమా గురించి దాదాపు ఏడాది కాలంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి వేణు ఎల్లమ్మ సినిమా ఎలాంటి డివోషనల్ వైబ్ కలిగిస్తుంది అన్నది చూడాలి. ఎల్లమ్మ కోసం మేకర్స్ సెపరేట్ సెట్ వర్క్ చేస్తున్నారట. సినిమా పీరియాడికల్ మూవీగా ఉంటుందని తెలుస్తుంది. సో దేవి శ్రీ ప్రసాద్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూ అదరగొట్టాడు.. సో హీరోగా అతని తొలి ప్రయత్నం అది కూడా దేవత కథ ఎలాంటి టర్న్ ఇస్తుందో చూడాలి. దేవి సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ గా మారిన డి.ఎస్.పీ మళ్లీ ఎల్లమ్మ కథతో కెరీర్ లో కొత్త టర్న్ తీసుకుంటున్నాడు.
