Begin typing your search above and press return to search.

ఎల్లమ్మ హీరోయిన్ ట్విస్ట్ కూడానా..?

వేణు డైరెక్షన్ లో రాబోతున్న ఎల్లమ్మ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఇంకా ఫైనల్ అవ్వలేదని టాక్. నితిన్ తోనే వేణు ఎల్లమ్మ చేస్తున్నాడని ఇప్పటికే చెప్పేశారు.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 3:00 PM IST
ఎల్లమ్మ హీరోయిన్ ట్విస్ట్ కూడానా..?
X

వేణు డైరెక్షన్ లో రాబోతున్న ఎల్లమ్మ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఇంకా ఫైనల్ అవ్వలేదని టాక్. నితిన్ తోనే వేణు ఎల్లమ్మ చేస్తున్నాడని ఇప్పటికే చెప్పేశారు. తమ్ముడు ఇంటర్వ్యూస్ లో నితిన్ ఓపెన్ అయ్యాడు. దిల్ రాజు కూడా అదే మాట చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నితిన్ ని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారని టాక్. నితిన్ ప్లేస్ లో మరో హీరో వస్తున్నాడని టాక్.

ఎల్లమ్మ హీరోయిన్ రోల్..

ఐతే ఎల్లమ్మ లేట్ కి హీరోని ఫైనల్ చేయడమే లేట్ అని అందరు అనుకున్నారు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ విషయంలో కూడా ట్విస్ట్ ఉందట. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా ప్రాధాన్యత ఉంటుందని. అందుకే సినిమాలో నాని ముందు చేయాలని అనుకున్నా మొత్తం క్రెడిట్ హీరోయిన్ కొట్టేస్తుందని వద్దన్నాడని టాక్. ఐతే ఈ క్రమంలో మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో ఫైనల్ అయ్యిందని అన్నారు.

కానీ ఇప్పుడు కీర్తి సురేష్ కాదు సాయి పల్లవినే ఈ హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. తెలుగులో సాయి పల్లవి సినిమాలు తక్కువ అయ్యాయి. ఆమె హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. తండేల్ తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు సాయి పల్లవి. ఐతే వేణు ఎల్లమ్మ సినిమాలో సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉందని లేటెస్ట్ టాక్. వేణు కూడా సాయి పల్లవి అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట.

ఫ్యాన్స్ కి పూనకాలు..

కీర్తి సురేష్, సాయి పల్లవి ఇంతకీ వేణు ఎల్లమ్మలో ఫైనల్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. హీరో మాత్రమే కాదు హీరోయిన్ విషయంలో కూడా ఎల్లమ్మ ట్విస్ట్ అండ్ టర్న్ కొనసాగుతూనే ఉంది. తప్పకుండా ఈ ఇద్దరిలో ఎవరైనా సరే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తారని చెప్పొచ్చు.

కీర్తి సురేష్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ఎల్లమ్మకి ఆమెను కన్ ఫర్మ్ చేశారని అన్నారు. కానీ ఎల్లమ్మ ఫైనల్ కాస్టింగ్ ఏంటన్నది క్లారిటీ రాలేదు. ఎల్లమ్మ సినిమా దిల్ రాజు పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారట. పీరియాడికల్ గా రాబోతున్న ఈ సినిమాలో గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్.