Begin typing your search above and press return to search.

'ఎల్లమ్మ'.. ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ దొరికేనా?

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారిన వేణు ఎల్దండి బలగం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   8 May 2026 7:00 PM IST
ఎల్లమ్మ.. ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ దొరికేనా?
X

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారిన వేణు ఎల్దండి బలగం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తెలంగాణ పల్లె జీవితం, ఎమోషన్స్ ను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఆ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని దర్శకుడు వేణును ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ స్థాయికి చేర్చింది.

బలగం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వేణు ప్రస్తుతం ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. డప్పు కళాకారుడు పర్షి పాత్రలో డీఎస్పీ కనిపించనున్నట్లు సమాచారం.

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతున్న విషయం హీరోయిన్ సెలక్షన్. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఆ కథకు మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ కావాలని దర్శకుడు వేణు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఆ సినిమాలో హీరోయిన్‌ గా సాయి పల్లవి పేరు వినిపించింది.

తెలంగాణ యాస, నేచురల్ యాక్టింగ్ కు ఆమె సరిపోతుందని భావించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టులో భాగం కాలేదనే టాక్ వినిపించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించింది. గతంలో దసరా సినిమాలో తెలంగాణ యువతిగా ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో ఎల్లమ్మకు ఆమె సరైన సెలెక్షన్ అవుతుందని సినీ ప్రియులు భావించారు.

కానీ కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలైంది. ఇక ఇటీవల మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. వరుస విజయాలతో మంచి ఫామ్‌ లో ఉన్న మృణాల్‌ ను తీసుకోవాలని మూవీ టీమ్ ఆలోచించిందని సమాచారం. అయితే ఆమె నుంచి కూడా స్పష్టమైన సమాధానం రాలేదని చర్చ నడుస్తోంది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఎల్లమ్మ ప్రాజెక్ట్‌ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడు హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారట. కథకు సరిపోయే, మార్కెట్ పరంగా కూడా సినిమాకు బలం చేకూర్చే స్టార్ హీరోయిన్‌ ను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ ఫైనల్ అయిన వెంటనే షూటింగ్‌ ను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఏదేమైనా బలగం తర్వాత వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఎల్లమ్మపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ నేటివిటీ, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ తో సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్ సెలక్షన్ విషయంలో లేట్ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. మరి చివరికి ఆ సినిమాలో హీరోయిన్‌ గా ఎవరు సెలెక్ట్ అవుతారు? ఎవరి నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కుతుంది? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.