Begin typing your search above and press return to search.

వేణు 'ఎల్లమ్మ' కథ ఎంతవరకు వచ్చింది?

సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టడమే కథలోని స్పిరిచ్యువాలిటీ, విలేజ్ కల్చర్ కు ఇచ్చే ఇంపార్టెన్స్ ను క్లియర్ గా తెలియజేస్తోంది.

By:  M Prashanth   |   6 May 2026 3:19 PM IST
వేణు ఎల్లమ్మ కథ ఎంతవరకు వచ్చింది?
X

బలగంతో విలేజ్ ఎమోషన్స్ ను హృదయానికి హత్తుకునేలా చూపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో చిత్రం ఎల్లమ్మతో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ మట్టివాసనతో, జానపద నేపథ్యంతో రూపొందుతున్న ఆ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ సెలక్షన్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు ఆసక్తికర మలుపు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టడమే కథలోని స్పిరిచ్యువాలిటీ, విలేజ్ కల్చర్ కు ఇచ్చే ఇంపార్టెన్స్ ను క్లియర్ గా తెలియజేస్తోంది. కథలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో, యాక్టింగ్ తో అదరగొట్టే హీరోయిన్ కోసం వేణు చాలా కాలంగా వెతుకుతున్నారు. మొదట ఆ పాత్ర కోసం నేచరుల్ బ్యూటీ సాయి పల్లవి పేరు వినిపించింది. ఆమె అయితే రోల్ కు పూర్తి న్యాయం చేస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

కానీ డేట్స్ సమస్యల కారణంగా ఆమె ప్రాజెక్ట్‌ కు దూరమైనట్లు సమాచారం. ఆ తర్వాత పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు. దీంతో హీరోయిన్ ఎంపిక మేకర్స్‌ కు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సీతారామం ఫేమ్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎల్లమ్మ పాత్ర కోసం మృణాల్‌ ను దాదాపు ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న, డెకాయిట్ వంటి చిత్రాల్లో ఎమోషనల్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె, ఆ రోల్ కు సరైన ఎంపికగా కనిపిస్తోందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో ఆమె చూపించిన టాలెంట్.. ఎల్లమ్మ సినిమాకు ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఇక సినిమాలో పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే, ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం. పర్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ లో ఆయన రగ్గడ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడిగానే కాకుండా చిత్రానికి సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. మొదట ఆ కథను నాని, నితిన్ వంటి హీరోలకు వినిపించినప్పటికీ, చివరకు డీఎస్పీతో ముందుకు వెళ్లాలని వేణు నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.

ఒక సంగీత కళాకారుడి కథ కావడంతో, ఆ పాత్రకు ఆయన సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ లో వేప ఆకులు, పసుపు, కుంకుమ, గజ్జెల మోత వంటి అంశాలు చూపించి సినిమాపై అంచనాలను పెంచారు.

ఏదేమైనా ఎల్లమ్మ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ ను సెలెక్ట్ చేయడం కథకు తగ్గ నిర్ణయమేనని జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఆ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ రానుంది. కానీ ఇప్పటికైతే వేణు తన కథకు సరైన బ్యూటీని ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. మరి మృణాల్ ను అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.