ఎల్లమ్మ ఎవరికోసం..?
బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ సినిమాపై రోజుకొక వార్త వైరల్ అవుతుంది.
By: Ramesh Boddu | 2 Dec 2025 11:21 AM ISTబలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ సినిమాపై రోజుకొక వార్త వైరల్ అవుతుంది. దిల్ రాజు నిర్మాతగా ఎల్లమ్మ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ కి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైంలో ఈ సినిమా కాస్టింగ్ కుదరక నానా తిప్పలు పడుతున్నారు చిత్ర యూనిట్. ఎల్లమ్మ సినిమా కోసం మొన్నటిదాకా హీరో విషయంలోనే ఫైనల్ డెసిషన్ అవ్వలేదని అంటుంటే.. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫైనల్ అవ్వలేదన్న మ్యాటర్ బయటకు వచ్చింది.
న్యాచురల్ యాక్టింగ్ తో మహానటిగా ప్రూవ్ చేసుకున్న..
ఎల్లమ్మ కోసం సాయి పల్లవిని అడిగితే ఆమె బాలీవుడ్ రామాయణంతో పాటు మరికొన్ని కమిట్మెంట్స్ వల్ల బిజీగా ఉండి ఆ సినిమా చేయననేసింది. ఐతే సాయి పల్లవి తర్వాత ఈ తరం నటీమణుల్లో తన న్యాచురల్ యాక్టింగ్ తో మహానటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ చేస్తుందని అనుకోగా ఆమె కూడా ఈమధ్య తాను ఎల్లమ్మ సినిమా చేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఐతే కీర్తి సురేష్ తోనే ఎల్లమ్మ అంటూ మొన్నటిదాకా గట్టి ప్రచారం జరగ్గా ఇప్పుడు సినిమాలో ఆమె లేదని తెలిసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు.. ఆ పాత్రలో ఎవరిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారన్నది క్లారిటీ రావట్లేదు. సాయి పల్లవి, కీర్తి సురేష్ రేసులో లేరని తెలుస్తుంది. కొత్త వాళ్లతో ఈ ప్రయోగం చేస్తారని ఆశించలేం. చూస్తుంటే సీనియర్ హీరోయిన్స్ ని తీసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
అనుష్క, సమంత లాంటి హీరోయిన్స్..
ఎల్లమ్మలో అనుష్క, సమంత లాంటి హీరోయిన్స్ చేసినా సరే ఆ కథకు వాళ్ల ఇమేజ్ పెర్ఫార్మెన్స్ సెట్ అవుతుంది. మరి సమంత, అనుష్కల గురించి దిల్ రాజు అండ్ టీం ఆలోచిస్తుందా లేదా మరో హీరోయిన్ ని ఎవరితో అయినా ఈ అటెంప్ట్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాస్టింగ్ సెట్ అయితే షూటింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు వేణు యెల్దండి.
ఐతే వేణు చేస్తున్న ఈ సినిమా లేట్ గా వచ్చినా సరే కచ్చితంగా మరోసారి గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ రైటింగ్ లోనే పూనకాలు వచ్చాయని తెర మీద ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. మరి ఎల్లమ్మ లక్కీ ఛాన్స్ అటు హీరో, ఇటు హీరోయిన్ ఎవరన్నది తెలియదు కానీ ఆ ఛాన్స్ తగిలిన వారు మాత్రం నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. దిల్ రాజు ఈ సినిమా కోసం చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నారట. ఎల్లమ్మ సినిమాతో మరోసారి ఎస్.వి.సీ రేంజ్ ఏంటో తెలిసేలా చేయబోతున్నారట దిల్ రాజు. అందుకే సినిమా విషయంలో ప్రతి విషయాన్ని చాలా ఫోకస్ తో ప్లాన్ చేస్తున్నారు.
