Begin typing your search above and press return to search.

ఫియర్ ఆఫ్ రిజెక్షన్.. అతనిలో నన్ను చూశా..!

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో సాయిలు అలియాస్ బోస్ తనతో జరిపిన ఫోన్ సంభాషణని చెప్పి ఎమోషనల్ అయ్యారు వేణు ఊడుగుల.

By:  Ramesh Boddu   |   26 Nov 2025 11:03 AM IST
ఫియర్ ఆఫ్ రిజెక్షన్.. అతనిలో నన్ను చూశా..!
X

థియేటర్ లో ఒక కొత్త సినిమా సందడి చేస్తుంది. ఆ సినిమా హీరో, హీరోయిన్ కొత్తవాళ్లే.. ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా కొత్తవారే.. సాయిలు డైరెక్ట్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఐతే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉన్న వ్యక్తి వేణు ఊడుగుల. నీది నాది ఒకే కథతో పాటు.. విరాటపర్వం సినిమా తీసిన దర్శకుడు వేణు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు నిర్మాణ సహకారం అందించారు.

వేణు ఊడుగుల ఎమోషనల్..

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో సాయిలు అలియాస్ బోస్ తనతో జరిపిన ఫోన్ సంభాషణని చెప్పి ఎమోషనల్ అయ్యారు వేణు ఊడుగుల. బోస్ ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి ఫోన్ చేశాడు.. అడ్రస్ చెప్పిన తర్వాత.. రావచ్చా అన్నా అన్నాడు.. మళ్లీ తాను చెప్పిన అడ్రస్ కి వచ్చి రావచ్చా అన్నా అని మరోసారి అడిగాడు.. ఆఫీస్ గేటు దగ్గరకు వచ్చి మరోసారి రావచ్చా అన్నా అన్నాడు. ఆఖరికి ఆఫీస్ కి వచ్చి కూడా రావచ్చా అన్నా అన్నాడు. అతనిలో ఉన్న ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఇన్ ఫ్రీరియారిటీ కాంప్లెక్స్ నన్ను నేను అతనిలో చూసుకున్నా అని ఎమోషనల్ అయ్యారు వేణు ఊడుగుల.

ఇక ఇదే ఈవెంట్ కి వచ్చిన స్టార్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాలో సాంగ్స్ ని ప్రశంసిస్తూ పాటలు రాసినట్టు లేదు యుద్ధం చేసినట్టు ఉంది అంత అగ్రెసివ్ గా ఉన్నాయి. కచ్చితంగా మా చిరంజీవి సినిమా కోసం ఒక పాట రాయాలని అన్నారు బాబీ. అంతేకాదు బోస్ లోని ఇన్నోసెన్స్ చాలా బాగా నచ్చింది. అందుకే చిరంజీవి గారి సినిమాలో అతనికో రోల్ ఇస్తున్నా అని అన్నారు. వెంటనే కోనా వెంకట్ మైక్ తీసుకుని బాస్ తో బోస్ అన్నారు.

సినిమాలో స్టార్స్ అవసరం లేదు..

మొత్తానికి రాజు వెడ్స్ రాంబాయి సినిమా సక్సెస్ తో ఆ చిత్ర యూనిట్ అందరికీ చాలా మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో స్టార్స్ అవసరం లేదు కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఆడియన్స్ వాళ్లని స్టార్స్ చేస్తారని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కి హీరో శ్రీవిష్ణు గెస్ట్ గా వచ్చారు. కోనా వెంకట్, డైరెక్టర్ బాబీ కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయిలు తనకు రాజు వెడ్స్ రాంబాయి పెద్ద కొడుకని చేసిన కామెంట్స్ సర్ ప్రైజ్ చేశాయి.