ఆ కాన్సెప్ట్ టచ్ చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ఓదెలపై వేణుస్వామి కామెంట్స్
చాలా కాలంగా సినిమాలకు సంబంధించిన విషయాలపై పెద్దగా మాట్లాడని వేణుస్వామి.. తాజాగా ది ప్యారడైజ్ మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
By: M Prashanth | 26 Sept 2026 4:25 PM ISTనేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ మూవీలో యాక్షన్ చూసి మాట్లాడుతున్నారంటే కామన్ అనుకోవచ్చు. కానీ.. సినిమాలో కనిపించిన ధూమావతి అమ్మవారి కాన్సెప్ట్ చూసి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా సినిమాలకు సంబంధించిన విషయాలపై పెద్దగా మాట్లాడని వేణుస్వామి.. తాజాగా ది ప్యారడైజ్ మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అయితే సినిమా ఎలా ఉంది, నాని ఎలా యాక్ట్ చేశారనే విషయాల జోలికి వెళ్లకుండా.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలో వాడిన డివోషనల్ ఎలిమెంట్స్ పైనే ఫోకస్ పెట్టారు. సాధారణంగా హీరో, కథ, యాక్షన్ ఇలా ఏదో ఒక కారణంతో సినిమాకు వెళ్లడం సహజం. కానీ ది ప్యారడైజ్ మూవీ చూడటానికి తనకు వేరే కారణం ఉందని వేణు స్వామి చెప్పారు. దశమహావిద్యలలో ఒకరిగా భావించే ధూమావతి అమ్మవారి ప్రస్తావన సినిమాలో ఉండటంతో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిందని తెలిపారు.
సినిమాలో ధూమావతి అమ్మవారి కాన్సెప్ట్ ను ఉపయోగించిన తీరు తనను ఆకట్టుకుందని వేణుస్వామి చెప్పారు. ముఖ్యంగా కాకిని సినిమాలో చూపించడం, ఓ యాక్షన్ సీన్ లో మంత్రాల బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ను యూజ్ చేయడం గురించి ప్రస్తావించారు. స్టోరీలో ఇలాంటి అంశాలను కలపడం ఇంట్రెస్టింగ్ గా ఉందని అన్నారు. ధూమావతి అమ్మవారి స్వరూపానికి ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉందని వేణుస్వామి వివరించారు.
ఆ దేవతకు సంబంధించిన పూజలు, మంత్రాలు, విధానాలను మామూలుగా తీసుకోకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాటి వెనుక ఉన్న సంప్రదాయాలు, నియమాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే సినిమా విషయానికి వస్తే.. శ్రీకాంత్ ఓదెల ఆ కాన్సెప్ట్ ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చిన విధానాన్ని వేణుస్వామి మెచ్చుకున్నారు. ధూమావతి అమ్మవారి వంటి స్పెషల్ ఎలిమెంట్ ను యాక్షన్ సీన్ తో లింక్ పెట్టడం చిన్న విషయం కాదని అన్నారు.
ఇలాంటి కాన్సెప్ట్ ను సినిమాలో టచ్ చేయడానికి దర్శకుడికి గుండె ధైర్యం ఉండాలని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ధూమావతి అమ్మవారి కాన్సెప్ట్, కాకి, బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఒకే సీన్ లో కథకు తగ్గట్టు ఉపయోగించే విధానం తనను ఆకట్టుకుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. దీంతో ఆ సినిమా విషయంలో శ్రీకాంత్ ఓదెల తీసుకున్న క్రియేటివ్ డిసెషన్ ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. వేణుస్వామి కామెంట్స్ తో ప్యారడైజ్ లోని ఆ సన్నివేశాలపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది.
ఇంతకీ ఆ సన్నివేశాల్లో ధూమావతి అమ్మవారి కాన్సెప్ట్ ను దర్శకుడు ఎందుకు ఉపయోగించారనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని మాస్ లుక్, యాక్షన్ సీన్స్ తో సినిమాకు స్పెషల్ హైప్ వచ్చింది. ప్రీమియర్ షోస్ తర్వాత మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. తొలి రోజు భారీ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
