Begin typing your search above and press return to search.

చిత్రాలయం బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి కొత్త సినిమా షూరూ..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై మూడో ప్రొడక్షన్ గా కొత్త సినిమా ప్రారంభించారు.

By:  M Prashanth   |   5 Aug 2025 10:51 PM IST
చిత్రాలయం బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి కొత్త సినిమా షూరూ..
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై మూడో ప్రొడక్షన్ గా కొత్త సినిమా ప్రారంభించారు. విశ్వం, రామం తర్వాత ఆయన నిర్మిస్తున్న మూడో సినిమా ఇది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పరిశ్రమ పెద్దలు రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కెఎస్ రామారావు వంటి అతిరథమహారథులు హాజరయ్యారు.

ఇక ముహూర్తపు కార్యక్రమం ఘనంగా జరిగింది. రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కె.ఎస్. రామారావు కెమెరా ఆన్ చేశారు. దర్శకుడు పి. మహేష్ బాబు మొదటి షాట్ తీశారు. ఈ కార్యక్రమం సినిమా స్థాయిని మరింత పెంచింది. అగ్రశ్రేణి నటులు, నైపుణ్యం కలిగిన దర్శకుడితో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందని అన్నారు.

ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మారియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవిక తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. మంచికంటి గుణి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. ఆయన తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. విభిన్న ఆలోచనలు, స్కిల్స్ కలిగిన ఆయన ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అలాగే నేపాల్ రాజకుటుంబానికి చెందిన నటి సమృద్ధి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్ తో కూడిన ఈ సినిమా తారాగణం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింగి.

ఇక చిత్ర బృందం ప్రేక్షకులకు ఉత్కంఠ భరితమైన సినిమా అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఆకట్టుకునే స్క్రిప్ట్, అద్భుతమైన తారాగణం, కొత్త కొత్త లొకేషన్స్ తో ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతి అందించనున్నారు. వేణు దోనేపూడి రెప్యుటేషన్, సినిమా చుట్టూ ఉన్న హైప్ తో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతి పొందుతారని మూవీటీమ్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది. కాగా, సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.