ఆ ఇద్దరి కమెడియన్స్ మధ్య టఫ్ ఫైట్..?
ఐతే స్టార్స్ మధ్య మాత్రమే కాదు ఇలాంటివి కమెడియన్స్ మధ్య కూడా జరుగుతాయి. ముఖ్యంగా లీడింగ్ కమెడియన్స్ మధ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి.
By: Ramesh Boddu | 20 Jan 2026 4:00 PM ISTటాలీవుడ్ లో స్టార్ సినిమాల మధ్య ఫైట్ తెలిసిందే. ముఖ్యంగా ఒక కథ ఫలానా స్టార్ ఇంప్రెస్ అయ్యాడని తెలియగానే మరో స్టార్ దాన్ని ఓకే చేసి సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. ఇద్దరు స్టార్స్ ఒకే కథ డిస్కస్ చేయడం అలా ఒకరు మిస్ చేసుకోగా మరొకరు ఓకే చేయడం లాంటివి జరుగుతుంటాయి. ఐతే స్టార్స్ మధ్య మాత్రమే కాదు ఇలాంటివి కమెడియన్స్ మధ్య కూడా జరుగుతాయి. ముఖ్యంగా లీడింగ్ కమెడియన్స్ మధ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి.
అతను సినిమాలో ఉంటే నెక్స్ట్ లెవెల్..
టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న ఇద్దరు కమెడియన్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. వాళ్లిద్దరి మధ్య అంటే వాళ్లకు వచ్చే అవకాశాల మధ్య అన్నమాట. కమెడియన్ వెన్నెల కిషోర్ తొలి సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతను సినిమాలో ఉంటే ఆ కామెడీ.. ఆ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ పండితే సినిమా సక్సెస్ కి మంచి పుష్ ఇస్తుంది.
2005 వెన్నెల సినిమా నుంచి రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన సినిమా వరకు వెన్నెల కిషోర్ తన కామెడీతో అలరిస్తూనే ఉన్నాడు. మరోపక్క కమెడియన్ సత్య కూడా ఈమధ్య దూసుకెళ్తున్నాడు. సత్య కి ఏదైనా రోల్ ఇస్తే దాన్ని అదరగొట్టేస్తాడు. కమెడియన్ గా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్నాడు సత్య. ఈమధ్య అతను లీడ్ రోల్ లో కూడా జెట్ లీ అనే సినిమా మొదలైంది.
కమెడియన్స్ మధ్య ఎంత పోటీ ఉన్నా.. ఆరోగ్యకరంగా..
వెన్నెల కిషోర్, సత్య మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది. ఫలానా సినిమాలో సత్య కి మంచి రోల్ పడిందని అంటే.. ఫలానా సినిమాలో వెన్నెల కిషోర్ అదరగొట్టారని అంటుంటారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్. 2009 లో ద్రోణ సినిమాతో సత్య తన సినీ ప్రయాణం మొదలు పెట్టగా ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయెస్ట్ కమెడియన్ గా అదరగొట్టేస్తున్నాడు.
సో ఈ ఇద్దరు ఇలానే దూసుకెళ్తే తెలుగు ఆడియన్స్ కి మరింత ఎంటర్టైనింగ్ రోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కమెడియన్స్ మధ్య ఎంత పోటీ ఉన్నా అదంతా కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకరిని మరొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. లెజెండరీ కమెడియన్స్ బ్రహ్మానందం, అలి స్థానాల్లో ఇప్పటితరం కమెడియన్స్ కూడా ప్రేక్షకులను తమ కామెడీతో మెప్పిస్తున్నారు. ఐతే టాలీవుడ్ లో వెన్నెల కిషోర్, సత్య మాత్రం మిగతా వారికన్నా కాస్త ముందున్నారు. వీళ్లు చేసే కామెడీ ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో వీళ్ల మధ్య సినిమాల ఫైట్ ఎలా ఉన్నా ఇద్దరు ఆడియన్స్ ని నవ్వించడంలో అసలు తగ్గొద్దని కోరుకుందాం.
