Begin typing your search above and press return to search.

గ‌ర్ల్‌ఫ్రెండ్ లో ఆ క్యారెక్ట‌ర్ న‌న్ను చేయ‌మ‌న్నాడు

టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ నటించిన తాజా సినిమా డెకాయిట్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 April 2026 2:53 PM IST
గ‌ర్ల్‌ఫ్రెండ్ లో ఆ క్యారెక్ట‌ర్ న‌న్ను చేయ‌మ‌న్నాడు
X

టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ నటించిన తాజా సినిమా డెకాయిట్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేపడుతున్న భారీ ప్రమోషన్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన చిట్‌చాట్ వీడియోలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ మరియు అడివి శేష్ కలిసి పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో వెన్నెల కిషోర్ చెప్పిన విషయాలు వినోదాన్ని పంచడంతో పాటు, శేష్‌తో ఉన్న అతని అనుబంధాన్ని కూడా బయటపెట్టాయి.

తన ప్రతి సినిమాలో వెన్నెల కిషోర్‌ను నటింపజేయాలనే భావన శేష్‌కు ఒక రకమైన సెంటిమెంట్‌గా మారిందని ఈ సందర్భంగా కిషోర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని సరదాగా చెప్పిన అతను, ఒకసారి ఇది చాలా ఇంటెన్స్ సినిమా అని చెప్పి, ఎస్టీడీ బూత్‌లో కూర్చునే పాత్ర ఇచ్చాడు. హీరో తరచూ అక్కడికి వచ్చి హీరోయిన్‌తో మాట్లాడుతుంటాడు. ఆ బూత్‌లో నువ్వుంటావ్ అని చెప్పి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడని నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు. నీకు ఇది సెంటిమెంట్ కదా, కానీ ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఇవ్వక‌ని శేష్‌కు చెప్పిన సందర్భాన్ని ఆయన హాస్యంగా వివరించాడు.

ఇక రాహుల్ రవీంద్రన్ గురించి మాట్లాడుతూ, అతను తనలో క‌మెడియ‌న్ ను కాకుండా విజయ్ సేతుపతిని చూస్తాడని కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గర్ల్‌ఫ్రెండ్ మూవీలో ప్రొఫెసర్ పాత్ర చేయమన్నాడ‌ని, ఒక‌వేళ ఆ పాత్ర‌ను నేను చేసి ఉంటే ఎంత కామెడీగా ఉండేదో ఊహించుకుంటేనే నవ్వొస్తుంద‌ని అన్నాడు. దీనికి స్పందించిన రాహుల్, ఒక నటుడిగా నీ సామర్థ్యం నీకు పూర్తిగా తెలియదంటూ కిషోర్‌ను ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. అయితే, దానికి కూడా కిషోర్ తన స్టైల్లోనే స్పందిస్తూ, ఈ మాట చెప్పే నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తావంటూ నవ్వులు పూయించాడు. మొత్తం మీద ఈ చిట్‌చాట్‌లో ముగ్గురి మధ్య ఉన్న స్నేహం, సరదా సంభాషణలు స్పష్టంగా కనిపించాయి.