ప్రొడ్యూసర్‌గా మారిన క్రేజీ డైరెక్టర్!
టాలీవుడ్‌లో అటు వాళ్లు ఇటు ఇటు వాళ్లు అటు షిఫ్ట్ అవుతున్నారు. అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ అవుతున్నారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అవుతున్నారు అన్నమాట.
By: Ravindar Gorantla | 11 March 2026 6:00 AM ISTటాలీవుడ్‌లో అటు వాళ్లు ఇటు ఇటు వాళ్లు అటు షిఫ్ట్ అవుతున్నారు. అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ అవుతున్నారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అవుతున్నారు అన్నమాట. ఇప్పటికే కొంత మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుగానూ మారి సినిమలు చేయడం సక్సెస్‌లని సొంతం చేసుకోవడం వంటివి చేశారు. ప్రొడ్యూసర్లు కూడా ఒకరిద్దరు డైరెక్టర్లుగా సినిమాలు చేస్తున్నారు. `విరాట పర్వం` డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగానూ ఇటీవల `రాజు వెడ్స్ రాంబాయి` మూవీని యంగ్ ప్రొడ్యూసర్‌తో కలసి నిర్మించడం, అది సక్సెస్ కావడమే కాకుండా గద్దర్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంతో పాటు పలు అవార్డుల్ని దక్కించుకుంది.
ఇక `#90`s` డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి చేసిన `లిటిల్ హార్ట్స్` ఏరేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుందో అందరికి తెలిసిందే. నిర్మాత అభిషేక్ నామా డైరెక్టర్‌గా మారి `నాగబంధం` మూవీని చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ అందరిని ఆశ్చర్యపరిచింది. మేకింగ్ పరంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలని గుర్తు చేసిందనే కామెంట్‌లు వినిపించాయి. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే వీరి తరహాలోనే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. గత ఏడాది నితిన్ కథానాయకుడిగా `రాబిన్ హుడ్` మూవీ చేసిన ఆయన ఆశించిన సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోయారు. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అందులో 25 శాతం వసూళ్లని కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ కోసం కొంత టైమ్ తీసుకుంటున్న వెంకీ కుడుముల ఆ టైమ్‌లో ప్రొడ్యూసర్‌గా మారి ఓ క్యూట్ లవ్ స్టోరీని మరో పార్ట్నర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆర్.పి. వర్మతో కలిసి ఓ లవ్‌స్టోరీని నిర్మిస్తున్నారు. అనిష్, అనస్వరా రాజన్ ఇందులో జంటగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఓ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో హీరో, హీరోయిన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలని, ఓ సాంగ్‌ని షూట్ చేశారు. ఎలాంటి హడావిడీ లేకుండానే సినిమా చాలా ఫస్ట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
దర్శకుడిగా చెలో, భీష్మ వంటి సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్‌లని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల ప్రొడ్యూసర్‌గా ఈ కొత్త జర్నీలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ని సొంతం చేసుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీపై యూనిట్‌లో పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఈ మూవీ తరువాత వెంకీ కుడుముల మళ్లీ పెద్ద స్టార్‌తో సినిమాని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్.
