స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు
‘ఛలో’ సినిమాతో రష్మిక మందన్నను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల.. అప్పుడే ఆమె టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. మొదట తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపని రష్మికను ఒప్పించి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్గా కొనసాగుతున్నారు.
By: M Prashanth | 11 Nov 2026 10:08 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కొందరు హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరికి స్టార్ స్టేటస్ రావడానికి చాలా కాలం పడుతుంది. అయితే దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం ఓ హీరోయిన్ కెరీర్ గురించి మొదట్లోనే గట్టిగా నమ్మారట. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అప్పుడే సోషల్ మీడియాలో కూడా చెప్పారట. ఇప్పుడు ఆ హీరోయిన్ ఇండియాలోనే బిజీ స్టార్స్‌లో ఒకరిగా మారిపోయారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన్న. త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన వెంకీ కుడుముల దర్శకుడిగా చేసిన తొలి సినిమా 'ఛలో'. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రంతోనే రష్మిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఆమెను ఈ సినిమాకు ఒప్పించడం అంత ఈజీగా జరగలేదట. అప్పటికే కన్నడలో 'కిరిక్ పార్టీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మొదట తెలుగు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదని వెంకీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అయినా వెంకీ కుడుముల వెనక్కి తగ్గకుండా ఆమెను ఒప్పించారట. అంతేకాదు, అప్పట్లోనే రష్మిక టాలీవుడ్లో 'నెక్స్ట్ బిగ్ థింగ్' అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారట. అప్పటికి ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాంటి సమయంలో రష్మికపై వెంకీకి అంత నమ్మకం ఉండటం విశేషం. ఇప్పుడు ఆమె కెరీర్ చూస్తే వెంకీ అంచనా ఎంతవరకు నిజమైందో అర్థమవుతుంది.
2018లో వచ్చిన 'ఛలో' మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన 'గీత గోవిందం' రష్మికకు భారీ క్రేజ్ తెచ్చింది. మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా 'పుష్ప 2'తో రష్మిక పేరు దేశవ్యాప్తంగా మరింత బలంగా వినిపించింది. హిందీలోనూ వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.
ఇక వెంకీ కుడుముల కూడా తన రెండో సినిమాలో రష్మికనే హీరోయిన్గా తీసుకున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కించిన 'భీష్మ'లో ఆమె నటించారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా తన తొలి రెండు సినిమాల్లో రష్మికతో పనిచేసిన వెంకీ, ఆమె కెరీర్ ప్రారంభంలో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తుచేసుకున్నారు.
