సూర్యతో వెంకీ రిస్క్ తీసుకోవడం లేదుగా?
వెంకీ అట్లూరి టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్లలో అతడొకడు. తొలి సినిమా `తొలిప్రేమ`ను ఎంతో క్లాసిక్ గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
By: Srikanth Kontham | 27 Dec 2025 4:00 PM ISTవెంకీ అట్లూరి టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్లలో అతడొకడు. తొలి సినిమా `తొలిప్రేమ`ను ఎంతో క్లాసిక్ గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. అటుపై తెరకెక్కించిన `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` లాంటి చిత్రాలు ప్లాప్ అయినా? వాటిలోనూ తనదైన సెన్సిబిలిటీ హైలైట్ అవుతుంది. `సార్` చిత్రంలోనూ తనదైన మార్క్ కనిపిస్తుంది. పాఠాలు చెప్పే పంతుళ్ల మధ్య కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీని టచ్ చేసాడు. ఆ తర్వాత తెరకెక్కించిన `లక్కీ భాస్కర్` మంచి విజయం సాధించింది. వెంకీ ఎలాంటి కంటెంట్ తీసుకున్నా? సెన్సిబిలిటీని మాత్రం ఎందులోనూ మిస్ అవ్వలేదు.
అదే అతడి సక్సస్ పాయింట్. ప్రస్తుతం సూర్య 46వ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నేపథ్యం ఏంటి? అన్నది ఇంత వరకూ ఎక్కడా చర్చకు రాలేదు. సూర్య టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు? అన్న పాయింట్ హైలైట్ అవుతుంది తప్ప! అతడితో ఎలాంటి కంటెంట్ తో వస్తున్నాడు? అన్నది పెద్దగా చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రంగా లీకులందుతున్నాయి. సూర్య సినిమాలో 45 ఏళ్ల వయసున్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడుట.
హీరోయిన్ 20 ఏళ్ల యువతిగా కనిపించనుందిట. ఈ రెండు పాత్రల మధ్య ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ హైలైట్ అవుతుందంటున్నారు. ఇద్దరి మధ్య మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చి , ఎమోషనల్ గా హైలైట్ కనెక్ట్ చేసే ఓ ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ దర్శకుడు హీరో-హీరోయిన్ వయసు తగ్గించేసాడు. వాస్తవానికి సూర్య వయసు 50 కాగా, మమితా బైజు వయసు 24 ఏళ్లు. ఇందులో సూర్య వయసు 5 ఏళ్లు తగ్గించగా, మమిత వయసు 4 ఏళ్లు మైనస్ చేసాడు. అంటే 45 ఏళ్ల వయసున్న వ్యక్తి 20 ఏళ్ల యువతి మధ్య ప్రేమ కోణాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేస్తున్నాడు? అన్నది చూడాలి.
ఇదెంతో సున్నిమతైన అంశం. ఏమాత్రం తేడా జరిగిన తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. `ధురంధర్` రిలీజ్ కు ముందు రణవీర్ సింగ్ వయసు విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల సారా అర్జున్ తో 40 ఏళ్ల నటుడు రొమాన్స్ చేయడం ఏంటని? రిలీజ్ కు ముందు అంతా దుమ్మెత్తి పోసారు. రిలీజ్ తర్వాత చడిచప్పుడు లేకపోయినా? రిలీజ్ కు ముందు మాత్రం అక్షింతలు తప్పలేదు. సూర్య విషయంలో అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్నది అభిమానుల కోరిక.
