'సార్' మూవీ హీరో ముందు ధనుష్ కాదా? అప్పుడేం జరిగింది?
రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన సార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 20 Oct 2025 3:08 PM ISTరెండేళ్ల క్రితం రిలీజ్ అయిన సార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్ మెసేజ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు.
అయితే ఆ సినిమాలో ముందుగా హీరోను మాస్ మహారాజా రవితేజ అనుకున్నారట వెంకీ అట్లూరి. స్టోరీ కూడా నెరేట్ చేశారు. రవితేజకు కథ బాగా నచ్చింది. కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆయన చేయలేదట. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా వెంకీ అట్లూరినే వెల్లడించారు. రవితేజ అప్ కమింగ్ మూవీ మాస్ జాతర ప్రమోషన్స్ లో భాగంగా రివీల్చేశారు.
రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర మూవీ.. అక్టోబర్ 31వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ఫుల్ జోష్ గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా వెంకీ అట్లూరితో ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మేకర్స్. ఆ సమయంలో వెంకీ అట్లూరి తాను తీసిన సార్ మూవీ కోసం ప్రస్తావించారు.
"నేను సార్ మూవీ స్టోరీని రాశాక తొలుత రవితేజ అన్నను కలిసి వినిపించాను. ఆయనకు కథ బాగా నచ్చింది. అయితే అప్పటికే వరుస సినిమాలకు ఆయన కమిట్ అవ్వడం వల్ల మూడు నెలలు వెయిట్ చేయమని చెప్పారు. వెయిట్ చేయమని నేను ఎవ్వరికీ అనను అని కూడా తెలిపారు. చూసుకో అని చెప్పారు" అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు.
"ఆ తర్వాత రెండు మూడు నెలల్లో ధనుష్ గారు నాకు ఓకే చెప్పారు. ఆయన సెట్ అయ్యాక మళ్లీ ఫస్ట్ రవి అన్నకు చెప్పా. అప్పుడు కోవిడ్ టైమ్.. నేను ఒకసారి కలవవచ్చా అని అడిగా. వెంటనే అన్న వీడియో కాల్ చేశారు. ఏంటబ్బా ఏంటి విషయమని అడిగారు. రవి అన్న ఇలా అవకాశం వచ్చిందని చెప్పా" అని వెంకీ తెలిపారు.
"వెంటనే ఆయన ధనుష్ సూపర్ యాక్టర్.. ఆయనతో చేసేయ్.. అసలు ఆలోచించకని రవి అన్న నాకు చెప్పారు. ఏదేమైనా విషయాన్ని నాకు చెప్పావ్.. అది నాకు నచ్చింది అని అన్నారు. ఆ తర్వాత సినిమా చూశాక కూడా నాతో మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు. నేనైతే అలా చేసేవాడినని కాదు అన్నారు. కానీ రవి అన్న బాగ్ సెట్ అవుతారు" అని అట్లూరి తెలిపారు.
"సార్ విషయంలో రవి అన్న ఎక్కడా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ తెచ్చుకోలేదు. నేను చేయాల్సిన కథ ఇంకొకరి దగ్గరికి వెళ్లిందని అనుకోలేదు. మేం ఇప్పటి వరకు కలిసి పని చేయలేదు. కానీ అన్న-తమ్ముడు రిలేషన్ మాది" అని వెంకీ అట్లూరి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
