Begin typing your search above and press return to search.

హీరోగా అనౌన్స్ చేసి రిజెక్ట్ చేశారు..కానీ అదే బెస్ట్ రోజు అంటున్న కింగ్డమ్ విలన్!

'కింగ్డమ్' మూవీలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కంటే ఇందులో విలన్ గా నటించిన మలయాళం నటుడు. వెంకటేష్ వీపీ గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   8 Aug 2025 1:27 PM IST
హీరోగా అనౌన్స్ చేసి రిజెక్ట్ చేశారు..కానీ అదే బెస్ట్ రోజు అంటున్న కింగ్డమ్ విలన్!
X

ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. వారికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా అందులో వారి యాక్టింగ్ బాగుంటే.. అసలు వీరి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు.అయితే రీసెంట్ గా విడుదలైన కింగ్డమ్ మూవీ నటుడు గురించి కూడా ఈ విధంగానే వెతుకున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో మొదట తనను రెండు సినిమాలలో హీరోగా అనౌన్స్ చేసి, ఆ తర్వాత సినిమా నుండి తప్పించారని, కానీ తన జీవితంలో అదే ఒక బెస్ట్ డే అంటూ చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

'కింగ్డమ్' మూవీలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కంటే ఇందులో విలన్ గా నటించిన మలయాళం నటుడు. వెంకటేష్ వీపీ గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు.

అసలు ఈయన ఎవరు..? ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడు? అని ఆయన యాక్టింగ్ ని మెచ్చుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అలా వెంకటేష్ వీపీ కింగ్డమ్ ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా బయటపడింది. అయితే అలాంటి వెంకటేష్ కింగ్డమ్ మూవీ విడుదలయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నన్ను మొదట హీరోగా తీసుకొని రెండు సినిమాలు అనౌన్స్ చేశారు.ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ సినిమాలలో నన్ను తీసుకోలేదు. వేరే వాళ్ళని తీసుకున్నారు. అయితే ఓ సినిమా కోసం ఏకంగా హీరోగానే కన్సిడర్ చేశారు.. నేను అందులో హీరోగా చేయకపోయినప్పటికీ నన్ను హీరోగా కన్సిడర్ చేశారు అనే మాట నాకు చాలా తృప్తిని ఇచ్చింది. చాలా పొంగిపోయాను. నా జీవితంలో ఆరోజు బెస్ట్ డే.. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నన్ను హీరోగా అనుకొని వేరే వాళ్ళని అందులో రీప్లేస్ చేశారు. దానికి కారణం అప్పుడు నా దగ్గర మనీ లేదు.ఏదైనా చేయాలంటే మనీ కావాలి కదా.. వేరే వాళ్ళు ఇచ్చారు.. వాళ్ళని పెట్టుకున్నారు. ఇదంతా మ్యాటర్ కాదు కానీ నన్ను వాళ్ళు హీరోగా అనుకోవడమే నాకు చాలా గొప్ప అనిపించింది.." అంటూ తన లైఫ్ లో ఉన్న బెస్ట్ మూమెంట్ ని పంచుకున్నారు వెంకటేష్..

ఇక చూడ్డానికి హీరో కటౌట్ తో ఉన్న వెంకటేష్ కింగ్డమ్ మూవీలో విలన్ పాత్రలో మాత్రం అదరగొట్టారని చెప్పుకోవచ్చు. మలయాళ నటుడు అయినటువంటి వెంకటేష్ మొదటిసారి తెలుగులో నటించారు. ఇక ఈయన మలయాళంలో పలు సీరియల్స్ చేసి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి, ఆ తర్వాత కీ రోల్స్ చేసే స్థాయికి ఎదిగారు. అలా గత ఏడాది జీవి ప్రకాష్ నటించిన 'రెబల్' మూవీ లో కూడా విలన్ గా నటించారు. ఈ సినిమాలో విలనిజాన్ని గుర్తించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ మూవీలో విలన్ గా అవకాశం ఇచ్చారు. ఈ మూవీతో వెంకటేష్ లైఫ్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా తర్వాత వెంకటేష్ పేరు తెలుగులో మార్మోగిపోతుంది.యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ విలన్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే వెంకటేష్ కి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆయన యాక్టింగ్ చూసిన వాళ్లు అంటున్నారు.