ప్లాప్ డైరెక్టర్ తో హిట్ హీరో!
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కొంత కాలంగా వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. `మానాడు` తర్వాత సరైన హిట్ పడలేదు.
By: Srikanth Kontham | 5 Nov 2025 4:00 PM ISTకోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కొంత కాలంగా వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. `మానాడు` తర్వాత సరైన హిట్ పడలేదు. `మన్మదలీల`, `విక్టిమ్` లాంటి చిత్రాలు యావరేజ్ గా ఆడగా ఆ తర్వాత రెండు సినిమాలు డిజాస్టర్లగా నమోదయ్యాయి. నాగ చైతన్య హీరోగా తెరకెక్కించిన `కస్టడీ` ప్లాప్ అయింది. ఇదే వెంకట్ ప్రభు తొలి తెలగు సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైనా అంచనాలు తప్పింది. దీంతో మరో ఆలోచన లేకుండా తిరిగి కోలీవుడ్ కి వెళ్లిపోయాడు. వెంకట్ గత విజయాలు చూసి దళపతి విజయ్ మరో అవకాశం ఇచ్చాడు.
మరో టైమ్ ట్రావెల్ సినిమా:
అతడితో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం జై , శివ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో `పార్టీ` అనే చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాడు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే వెంకట్ ప్రభు మరో హీరోని లాక్ చేసాడు. శివ కార్తికేయన్ తో ఓ సినిమా ఒకే అయింది. ఇద్దరి కాంబినేషన్ లో ఓ టైమ్ టావెల్ కాన్సెప్ట్ తో సినిమా రూపొందనుంది. ఇందులో శివ కార్తికేయన్ కి జోడీగా ప్రియదర్శన్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్లాప్ ప్రభావం లేని హీరో:
శివ కార్తికేయన్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. `అమరన్` విజయంతో శివ కార్తికేయన్ స్టార్ లీగ్ లో చేరాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధి చింది. దీంతో శివ కార్తికేయన్ ఇమేజ్ రెట్టింపు అయింది. అయితే ఆ తర్వాత చేసిన `మదరాసి` మాత్రం అంచనాలు అందుకవోడంలో విఫలమైంది. అయినా ఆ ప్రభావం శివ కార్తికేయన్ పై పెద్దగా పడలేదు. `అమరన్` విజయం ముందు ఈ ప్లాప్ హైలైట్ అవ్వలేదు.
ఎలాంటి డౌట్ లేకుండా:
పైగా `మదరాసి` తెరకెక్కించింది మురగదాస్ కావడంతో ప్లాప్ క్రిడెట్ అంతా అతడి ఖాతాలోకే పోయింది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఊపులో శివ కార్తికేయన్ వెంకట్ ప్రభుతో సినిమా చేయడం ఎంత వరకూ కలిసొస్తుంది? అన్నది చూడాలి. వెంకట్ ప్రభు ప్లాపు లు శివ కార్తికేయన్ అభిమానుల్ని డైలమాలో పడేస్తున్నాయి. అతడితో సినిమా కి ఇది సరైన సమయమేనా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ఎలాంటి డౌట్లు లేకుండా ముందుకెళ్తున్నాడు.
