వెంకటరమణ కోసం మాలీవుడ్ అందమే అందమా!
ఆ సినిమా డైరెక్టర్ మరోకరు అయినా? అందులో హీరోయిన్ గా తానే ఎంపిక చేసాడు. అటుపై `సార్` చిత్రంలో కూడా ఆయనే అవకాశం కల్పించారు. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేసినా ఆ కథను పైనల్ చేసింది.
By: Srikanth Kontham | 18 Sept 2025 9:00 AM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. త్రిష, రుక్మిణీ వసంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. కానీ త్రిష మాత్రం ఎంపికయ్యే అవకాశాలు తక్కువనే అంటున్నారు. ఇప్పటికే వెంకటేష్ తో కలిసి సినిమాలు చేసిన నేపథ్యంలో మరోసారి ఆమెని ఎంపికపై అనాసక్తి వ్యక్తమవుతోంది.
వెంకటేష్ సరసన ఆమె కంటే కొత్త భామ అయితే బాగుంటుందనే అభిప్రాయం తెరపైకి వస్తోంది. రుక్మిణీ వసంత్ పర్పెక్ట్ జోడీ అవుతుంది. మరి ఛాన్స్ ఉందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఆ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగానూ ఉంది. తాజాగా ఇదే రేసులో మాలీవుడ్ అందం సంయుక్తామీనన్ పేరు తెరపైకి వచ్చింది. గురూజీ ఈ బ్యూటీని తీసుకోవడానికి అవకాశం ఉందంటున్నారు. టాలీవుడ్ లో ఈ బ్యూటీకి తొలి అవకాశం ఇచ్చింది గురూజీనే. `భీమ్లా నాయక్` సినిమాకు గురూజీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా డైరెక్టర్ మరోకరు అయినా? అందులో హీరోయిన్ గా తానే ఎంపిక చేసాడు. అటుపై `సార్` చిత్రంలో కూడా ఆయనే అవకాశం కల్పించారు. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేసినా ఆ కథను పైనల్ చేసింది. నిర్మాణ వ్యవహారాలు ఆయన అనుబంధ సంస్థలే చూసుకుంది. అలా గురూజీ సారథ్యంలో సంయుక్తా మీనన్ రెండు సినిమాలకు పనిచేసింది. కానీ నేరుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో `వెంకటరమణ`లో సంయుక్తా మీనన్ ని తీసుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరిస్తే గానీ క్లారిటీ రాదు.
ప్రస్తుతం సంయుక్తా మీనన్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో ఏకకాలంలో సినిమాలు చేస్తోంది. డిసెంబర్ లో `అఖండ 2`తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పాన్ ఇండియా చిత్రం లో నటిస్తోంది. శర్వానంద్ కు జోడీగా `నారీ నారీ నడుమ మురారీ`లోనూ నటిస్తోంది. విజయ్ సేతుపతి-పూరి సినిమాలో కూడా ఈ భామనే హీరోయిన్. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అవ్వనున్నాయి. సక్సెస్ అయితే అమ్మడు స్టార్ లీగ్లో చేరిపోతుంది.
