ఆడియన్స్ టేస్ట్ ఛేంజ్.. 20 ఏళ్ల మ్యాజిక్ రిపీట్ అవ్వాలంటే..
ఒకప్పుడు ఫ్యామిలీ సినిమా అంటే విక్టరీ వెంకటేశ్ గుర్తొచ్చేవారు. ఆయన కామెడీ, ఫ్యామిలీ రిలేషన్స్, మనసుకు దగ్గరగా ఉండే డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి.
By: M Prashanth | 20 Oct 2026 8:04 PM ISTఒకప్పుడు ఫ్యామిలీ సినిమా అంటే విక్టరీ వెంకటేశ్ గుర్తొచ్చేవారు. ఆయన కామెడీ, ఫ్యామిలీ రిలేషన్స్, మనసుకు దగ్గరగా ఉండే డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. అలాంటి సినిమాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తోడైతే ఆ ఎంటర్టైన్మెంట్ వేరు. అందుకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలే ఎగ్జాంపుల్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
అప్పుడు వెంకీ మూవీలకు రైటర్ గా వర్క్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు డైరెక్టర్ గా తొలిసారి వెంకీతో మూవీ తీస్తున్నారు. అయితే అప్పటి ప్రేక్షకులకు, ఇప్పటి ప్రేక్షకులకు చాలా తేడా ఉంది. మరి మారిన ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా ఆ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేయగలదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన చిత్రాలే.
కామెడీ, ప్రేమ, ఫ్యామిలీ రిలేషన్స్ కలిసిన ఆ సినిమా కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వెంకటేశ్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ ఆ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందంటే నార్మల్ గానే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ పాత సినిమాలకు వచ్చిన విజయాన్ని కొత్త సినిమాకు కూడా ఆశించడం అంత ఈజీ కాదు.
ఎందుకంటే గత 20 ఏళ్లలో సినిమా చూసే విధానం చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులకు కొత్త కథలు కావాలి. కథలో వేగం ఉండాలి. కామెడీతో పాటు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలి. ముఖ్యంగా సినిమాలో కొత్తదనం కనిపించాలి. కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఉంటే సరిపోదు. అవి కథలో నేచురల్ గా కలిసినప్పుడే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఆ ఛేంజ్ ను దర్శకుడు త్రివిక్రమ్ ఎంతవరకు అర్థం చేసుకున్నారన్నది మెయిన్.
ఆయనకు కుటుంబ కథలను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అదే సమయంలో కొత్త తరహా కథలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పాత సినిమాల్లో పనిచేసిన పద్ధతులనే మళ్లీ వాడకుండా, ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తేనే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అప్పటి మ్యాజిక్ ను మళ్లీ చూడాలంటే పాత జ్ఞాపకాలు మాత్రమే సరిపోవు.
మారిన ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గ స్టోరీ, కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ అవసరం. ఆ రెండింటినీ త్రివిక్రమ్ ఎంత బాగా మిక్స్ చేశారన్నదే ఆదర్శ కుటుంబం రిజల్ట్ ను డిసైడ్ చేయనుంది. అక్టోబర్ 30వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుందని వెంకటేష్ రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు మారినా.. సినిమాపై ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. . మరి ఆ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. 20 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
