Begin typing your search above and press return to search.

గురూజీ వెంకీ.. దసరాకి ట్రీట్ ఇస్తారా..?

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలు కాగా అప్పుడే టీజర్ కంటెంట్ రెడీ అయ్యిందట.

By:  Ramesh Palla   |   10 Sept 2025 4:00 PM IST
గురూజీ వెంకీ.. దసరాకి ట్రీట్ ఇస్తారా..?
X

విక్టరీ వెంకటేష్ తో రైటర్ గా పనిచేసిన త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్టర్ అయ్యాక వర్క్ చేయడం కుదర్లేదు. వాళ్లే ఛాన్స్ తీసుకోలేదా లేదా అసలు అలా థింక్ చేయలేదా అన్నది తెలియదు కానీ త్రివిక్రం డైరెక్టర్ గా మారిన ఇన్నేళ్లకు వెంకటేష్ తో సినిమా కుదిరింది. వెంకీ టైమింగ్ కు త్రివిక్రం డైలాగ్స్ అదిరిపోతాయి. ఫైనల్ గా ఈ ఇద్దరి కాంబో సినిమా సెట్ అయ్యింది. రీసెంట్ గానే సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.

టీజర్ కంటెంట్ రెడీ..

గుంటూరు కారం తర్వాత త్రివిక్రం వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలు కాగా అప్పుడే టీజర్ కంటెంట్ రెడీ అయ్యిందట. రాబోతున్న దసరాకి వెంకీ, త్రివిక్రం సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్ టీజర్ వస్తుందని టాక్. దసరాకి ట్రీట్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంటుందట. గురూజీ తో వెంకీ మామ కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కాబట్టి సినిమాపై అంచనాలు హై ఉన్నాయి.

రైటర్ గా ఉన్నప్పుడే వెంకటేష్ కి సూపర్ హిట్స్ అందించాడు త్రివిక్రం. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. త్రివిక్రం వెంకటేష్ దసరాకి ఇచ్చే స్పెషల్ ట్రీట్ పై ఇప్పటికే ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టాడు. త్రివిక్రం తో సినిమా కాబట్టి సరిగ్గా కుదిరితే మాత్రం ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.

గురూజీ తో వెంకీ సింక్ బాగానే..

వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. వెంకీ మామ టైమింగ్ ని పట్టుకుని సినిమా చేస్తే అది పక్కా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ గురూజీ తో వెంకీ సింక్ బాగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ ని కళకళలాడేలా చేస్తుందని చెప్పొచ్చు. వెంకటేష్ త్రివిక్రం సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ కి లాక్ చేశారు. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను చినబాబు నిర్మిస్తున్నారు. సినిమాలో మీనాక్షి చౌదరినే హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.

నెక్స్ట్ సమ్మర్ కి ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో వెంకీ మామ అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రం ఈ సినిమా తర్వాత ఎన్ టీ ఆర్ తో మైథాలజీ మూవీ చేయాల్సి ఉంది. వెంకటేష్ సినిమా చేస్తూనే ఆ మూవీకి సంబందించిన పనులు కూడా చేస్తున్నారని తెలుస్తుంది.