Begin typing your search above and press return to search.

వెంకీ డెసిష‌న్ పై రెండు రెండు సినిమాల భవిష్యత్తు!

ఇదే సమయంలో అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే క్లియ‌ర్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Jun 2026 9:00 PM IST
వెంకీ డెసిష‌న్ పై రెండు రెండు సినిమాల భవిష్యత్తు!
X

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న వెంకీ, మరోవైపు అనిల్ రావిపూడితో చేయబోయే భారీ ఎంటర్‌టైనర్ కోసం కూడా డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా వెంకటేష్‌కు ఎంతో ప్రాధాన్యమైనవే కావడంతో ప్రస్తుతం ఆయన ఒకరకంగా డబుల్ ప్రెజర్‌లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే ఆదర్శ కుటుంబం సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు దసరా రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాల క్వాలిటీ విష‌యంలో ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అవ్వ‌రు. త్రివిక్ర‌మ్ లోని ఆ క్వాలిటీనే ఇప్పుడు మ‌రోసారి మరోసారి వెంకటేష్ షెడ్యూల్‌పై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే క్లియ‌ర్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వ‌ర్క్స్ పూర్తి చేసి, షూటింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ చేసుకున్న అనిల్ టీమ్ ప్రస్తుతం వెంకటేష్ కోసం ఎదురుచూస్తోందని సమాచారం. అయితే ఆదర్శ కుటుంబం షూటింగ్ మరింత లేటైతే అనిల్ సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌డం కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే సంక్రాంతి రిలీజ్ టార్గెట్ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా వెంకటేష్‌కు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ కలిసొచ్చిన నేపథ్యంలో ఆ టార్గెట్‌ను మిస్ అవ్వడం ఆయన కెరీర్ పరంగా చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక సినిమా ఆలస్యం కావడం వల్ల మరో సినిమా షెడ్యూల్స్, బడ్జెట్ ప్లానింగ్, రిలీజ్ వ్యూహాలు అన్నీ ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

మరోవైపు ఈ పరిస్థితిని వెంకటేష్ కెరీర్‌లోనే ఓ స్పెష‌ల్ చాప్ట‌ర్ గా కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌లో మంచి స‌క్సెస్ రేట్ కలిగిన ఇద్దరు కమర్షియల్ డైరెక్ట‌ర్లైన‌ త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడిలతో వరుసగా పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఆదర్శ కుటుంబం దసరాకు, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి విడుదలైతే కేవలం నాలుగు నెలల వ్యవధిలో వెంకటేష్ నుంచి రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇది ఆయన కెరీర్‌లో అరుదైన ఘట్టంగా నిలిచే అవకాశ‌మూ లేక‌పోలేదు.

అయితే ఆ టార్గెట్ ను చేరుకోవాలంటే ముందుగా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ టైమ్ కు పూర్తవ్వాలి. వెంకటేష్ స్వయంగా త్రివిక్రమ్‌తో మాట్లాడి జూలై నాటికి తన పోర్ష‌న్ షూటింగ్ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం చూస్తుంటే ఇద్దరు స్టార్ దర్శకుల అంచనాలు, నిర్మాతల ప్రణాళికలు, ఫెస్టివల్ రిలీజ్‌ల లెక్కలన్నీ వెంకటేష్ డేట్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో వెంకీ తీసుకునే తదుపరి నిర్ణయాలు కేవలం ఈ రెండు సినిమాల భవిష్యత్తునే కాదు, వచ్చే ఏడాది టాలీవుడ్ ఫెస్టివల్ సీజన్ బాక్సాఫీస్ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.