Begin typing your search above and press return to search.

'ఆదర్శ కుటుంబం' కి కలిసివచ్చే అతిపెద్ద అంశం ఏంటో తెలుసా...?

ఆదర్శ కుటుంబం సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

By:  Ramesh Palla   |   2 Oct 2026 9:09 AM IST
ఆదర్శ కుటుంబం కి కలిసివచ్చే అతిపెద్ద అంశం ఏంటో తెలుసా...?
X

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలతో రచయితగా త్రివిక్రమ్‌కు మంచి పేరు వచ్చిచంది. ఆ సినిమాల తర్వాత దర్శకుడిగానూ త్రివిక్రమ్‌ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌లను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక పోవడం, త్రివిక్రమ్‌ వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు కమిట్ కావడం, దానికి తోడు వెంకటేష్‌ కి తగ్గ స్టోరీ లైన్‌ కోసం త్రివిక్రమ్‌ చాలా ఏళ్లు వెయిట్‌ చేశాడు. ఫైనల్‌గా త్రివిక్రమ్‌, వెంకటేష్‌ కాంబోలో మూవీ రూపొందింది. ఆదర్శ కుటుంబం అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట అక్టోబర్‌ 2 అనుకున్నప్పటికీ కాస్త ఆలస్యంగా అక్టోబర్‌ 9న విడుదల చేయబోతున్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో...

సాధారణంగా త్రివిక్రమ్‌ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి, కానీ ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం అంత హైప్‌ లేదని చెప్పాలి. చిత్ర యూనిట్‌ సభ్యులు కావాలనే సినిమాకు ఎక్కువ హైప్‌ క్రియేట్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక పక్కా ఫ్యామిలీ మూవీ అనే అభిప్రాయం కలిగే విధంగా ప్రమోషన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాలో కొంత పార్ట్‌ యాక్షన్‌ ఉన్నప్పటికీ కామెడీని ప్రధానంగా హైలైట్‌ చేసే విధంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు హైప్ రాకుండా సింపుల్‌గా విడుదల అయ్యి, పాజిటివ్‌ టాక్ దక్కించుకుంటే మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న భారీ బజ్‌ క్రియేట్‌ అయితే యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వెళ్లరని ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.

వెంకటేష్ ఆదర్శ కుటుంబం రిలీజ్‌...

ఆదర్శ కుటుంబం సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాకు భారీ హైప్‌ అయితే క్రియేట్‌ కాలేదు, అయితే సినిమా చూడాలి అనే ఆసక్తి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌లో కనిపిస్తుంది. కనుక సినిమాకు ఇదే కలిసి వచ్చే అంశం అవుతుందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా అంచనాలు లేవు కనుక, వెంకటేష్, త్రివిక్రమ్‌ సినిమా కనుక కచ్చితంగా మొదటి వారంలోనే థియేటర్‌కి వెళ్లేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. పైగా దసరా కూడా వస్తుంది కనుక కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ దసరా సెలవుల్లో సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ నుంచి ఎలాంటి సినిమాను ఆయన ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారో దాన్నే త్రివిక్రమ్‌ 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వెంకటేష్‌కు జోడీగా శ్రీనిథి శెట్టి...

వెంకటేష్‌కు జోడీగా ఈ సినిమాలో కేజీఎఫ్‌ హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి నటించింది. హారిక అండ్‌ హాసిని బ్యానర్‌లో ఎస్‌ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. చాలా స్పీడ్‌గా, మీడియం బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాకు భారీ బిజినెస్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందించడం జరిగింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకు థమన్‌ గతంలో సంగీతాన్ని అందించాడు. వీరిది హిట్ కాంబోగా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. దాంతో ఈ సినిమాకు సైతం థమన్‌ బెస్ట్‌ వర్క్ ఇచ్చి ఉంటాడని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్‌ కాంబో కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి కచ్చితంగా ఫుల్‌ మీల్స్ వంటి మూవీ ఇది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా అందుకునేనా అనేది అక్టోబర్‌ 9న క్లారిటీ రాబోతుంది.