Begin typing your search above and press return to search.

ఆదర్శ కుటుంబం.. ఇంకా చేయాల్సింది ఎక్కువే!

విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్ లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

By:  M Prashanth   |   27 Sept 2026 2:35 PM IST
ఆదర్శ కుటుంబం.. ఇంకా చేయాల్సింది ఎక్కువే!
X

విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఆడియన్స్ లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47 మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే రిలీజ్‌ కు సమయం దగ్గరపడుతున్నా.. మేకర్స్ ఇంకా చాలా చేయాల్సింది ఉందనే చెప్పాలి.

ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ముందు అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత రిలీజ్ డేట్ ను ఛేంజ్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 9 రిలీజ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఇదే తేదీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డీల్స్ కూడా క్లోజ్ చేసుకుంటున్నారని వినికిడి.

అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. రిలీజ్‌ కు ఇప్పుడు పెద్దగా సమయం లేదు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. కానీ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మొదలైనట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన ఈ కొద్దిరోజులు సినిమాకు చాలా ఇంపార్టెంట్ కానున్నాయి. వెంకటేష్‌ ను త్రివిక్రమ్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో నార్మల్ ఆడియన్స్ తోపాటు వెంకటేష్, త్రివిక్రమ్ అభిమానులు కూడా ప్రాజెక్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి కాంబినేషన్‌ పై నార్మల్ గా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకోవాలంటే సినిమాలో కంటెంట్ ఎంత ముఖ్యమో.. ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకెళ్లే ప్రమోషన్స్ కూడా అంతే మెయిన్. ఇప్పటివరకు వచ్చిన పాట, కాంబినేషన్‌ తో ఆసక్తి ఉన్నా.. సినిమా రిలీజ్‌ కు ముందు మరింత కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ట్రైలర్, ఇతర ప్రమోషన్ ఈవెంట్స్ తో సినిమాకు సంబంధించిన అసలు టోన్‌ ను మేకర్స్ మరింతగా చూపించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా త్రివిక్రమ్- వెంకటేష్ కాంబినేషన్‌ ను ఏ రేంజ్ లో యూజ్ చేసుకుంటారనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో ఉంది. అందుకే అక్టోబర్ 9 వరకు ఉన్న టైమ్ ఆదర్శ కుటుంబం టీమ్‌ కు చాలా మెయిన్. అయితే ఫ్యామిలీ స్టోరీకి కామెడీని యాడ్ చేసే త్రివిక్రమ్ మార్క్ టచ్‌ తో సినిమా ఉండబోతుందనే అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి నారాయణమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. వెంకటేష్‌ పై షూట్ చేసిన ఆ పాటకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఏదేమైనా సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే కంటెంట్‌ తో పాటు.. దానికి తగ్గ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా జరగాల్సి ఉంది. మరి మిగిలిన ఈ కొద్దిరోజుల్లో మేకర్స్ ఎలాంటి ప్లాన్‌ తో ముందుకు వెళ్తారో, సినిమాపై ఎంతటి బజ్ క్రియేట్ చేస్తారో అంతా వేచి చూడాలి.