హోమ్లీ టైటిల్.. లోపల మాత్రం ఊర మాస్ మసాలా!
తొలిసారి ఆ ఛాన్స్ త్రివిక్రమ్ తీసుకోవడం విశేషం. ఓ రకంగా సరైన అవకాశాలు లేని సమయంలో గురూజీ `అల వైకుంఠపురములో` ఓ రోల్ ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Jun 2026 11:29 AM ISTవిక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` తెరకెక్కుతోన్న సంగదగతి తెలిసిందే. టైటిల్ సహా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే? పక్కా ఫ్యామిలీ హిలేరియస్ ఎంటర్ టైనర్ అని జనాలంతా ఫిక్సై పొయారు. గత చిత్రాల ఆధారంగా ప్రేక్షకులంతా ఈ రకమైన అంచనాకి వచ్చేసారు అన్నది కాదనలేని నిజం. కానీ టైటిల్ లో ఫ్యామిలీ నేపథ్యం కనిపిస్తున్నా? లోపల మాత్రం త్రివిక్రమ్ మార్క్ హై-వోల్టేజ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ దట్టించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుందని భావించిన అందాల భామ నివేతా పేతురాజ్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కేవలం ఒక క్యారెక్టర్‌కే పరిమితం కాకుండా చిత్రంలో ఫుల్ లెంగ్త్ మాస్ స్పెషల్ సాంగ్‌లో అమ్మడు వెంకటేష్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుందనే వార్త బయటకొచ్చింది. ఈ సరికొత్త గ్లామర్ టచ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. నివేతా పేతురాజ్ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు హోమ్లీ, క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే గుర్తుకొస్తాయి.
అమ్మడు నటించిన గత చిత్రాలలో గ్లామర్ షో కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ చెన్నై బ్యూటీ తొలిసారి మాస్ అవతార్ ఎంచుకుని అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. టాలీవుడ్ లో ముందెన్నడూ లేని విధంగా ఊర మాస్ స్పెషల్ నంబర్‌లో కనిపించి.. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త గ్లామర్ విందును అందించడానికి సిద్ధమవుతోందని బలంగా బజ్ నడుస్తోంది. అయితే నివేదపై క్లాస్ ఇమేజ్ అంతా ఇక్కడే. పర భాషాల్లో అమ్మడు హాట్ గాళ్ గా ఎప్పుడో ఫేమస్ అయింది. ఆ ఇమేజ్ ను తెలుగు మేకర్స్ ఇంత వరకూ సద్వినియోగం చేసుకోలేదు.
తొలిసారి ఆ ఛాన్స్ త్రివిక్రమ్ తీసుకోవడం విశేషం. ఓ రకంగా సరైన అవకాశాలు లేని సమయంలో గురూజీ `అల వైకుంఠపురములో` ఓ రోల్ ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గురూజీ- నివేద మధ్య మంచి స్నే హం కొనసాగింది. ఇప్పుడా స్నేహమే ఆదర్శకుటుంబంలో కీలక మారే అవకాశం తెచ్చి పెట్టింది. త్రివిక్రమ్ సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఎంత అద్భుతంగా పండిస్తారో? కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ..స్పెషల్ సాంగ్స్‌ను కూడా అంతే స్టైలిష్‌గా డిజైన్ చేస్తారు. గతంలో ఆయన చిత్రాలలో ప్రత్యేక గీతాలు చార్ట్‌బస్టర్స్ అవ్వడమే కాకుండా వెండితెరపై విజువల్ వండర్స్‌గా నిలిచాయి.
తాజాగా `ఆదర్శ కుటుంబం` లాంటి సాంప్రదాయమైన టైటిల్ సినిమాలో నివేతా పేతురాజ్ లాంటి క్లాస్ హీరోయిన్‌తో మాస్ స్టెప్పులు వేయించడం వెనుక త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు - ఇతర కీలక షెడ్యూల్స్ వేగంగా పూర్తవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. సాంకేతిక నిపుణుల మార్పులు, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
