ఆదర్శ కుటుంబంలో సెకండ్ ఛాన్స్ ఉందా..?
విక్టరీ వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ లాక్ చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
By: Ramesh Boddu | 12 Dec 2025 11:12 AM ISTవిక్టరీ వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ లాక్ చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ సినిమాలో త్రివిక్రమ్ తన రెగ్యులర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా లేదా అన్న డౌట్ రేజ్ అవుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్ సెంటిమెంట్ అలానే కొనసాగుతుంది. ఐతే సెకండ్ హీరోయిన్ ని పెట్టినా ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతుంది.
మహేష్ మరదలి పాత్రలో మీనాక్షి..
ఇలా రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది. త్రివిక్రమ్ లాస్ట్ మూవీ గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల చేయగా సెకండ్ హీరోయిన్ అదే మహేష్ మరదలి పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. మీనాక్షి ఆ రోల్ ని ఎందుకు ఒప్పుకుందో కూడా తెలియదు. మహేష్ హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ అనగానే అమ్మడు మరదలి రోల్ కి ఓకే చెప్పేసింది. ఐతే ఆ రోల్ ఇంపార్టెన్స్ లేకపోవడంతో మీనాక్షి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
గురూజీ సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ పక్కన పెడితే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఐతే వెంకటేష్ తో తీసిన సినిమాకు ఆ సెంటిమెంట్ ఏదైనా ఫాలో అవుతున్నాడా అన్న డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి కన్ఫర్మ్ కాగా రెండో హీరోయిన్ ఉన్నా కూడా ఆమెకు కూడా కథలో ఇంపార్టెంట్ ఉండేలా చేస్తే బెటర్ అని అంటున్నారు. త్రివిక్రమ్ తన సినిమాలో చిన్న సీన్ లో కూడా స్టార్స్ ఉండాలనేది మంచి ఉద్దేశ్యమే కానీ అది సినిమాకు ప్లస్ అయితే బాగానే ఉంటుంది కానీ మైనస్ అయితే ఎఫెక్ట్ పడుతుంది.
ఆదర్శ కుటుంబం 2026 సమ్మర్ రిలీజ్..
అందుకే ఈసారి ఆదర్శ కుటుంబం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆదర్శ కుటుంబం త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్ గా వెంకీ మార్క్ పంచ్ లతో అదిరిపోతుందని టాక్. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయడం దగ్గుబాటి ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.
వెంకటేష్ త్రివిక్రమ్ ఇద్దరు కలిసి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు పనిచేశారు. రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా కూడా ఇన్నాళ్లు వెంకటేష్ తో పనిచేయడం కుదరలేదు. ఫైనల్ గా ఆదర్శ కుటుంబం తో అది సెట్ అయ్యింది. మరి గురూజీ తనకు రైటర్ గా సూపర్ హిట్ ఇచ్చిన వెంకటేష్ సినిమాను ఎలా తీస్తాడన్నది చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అజ్ఞాతవాసి సినిమా టైం లో పవన్ కళ్యాణ్ కోసం చిన్న క్యామియో చేశారు వెంకటేష్. ఐతే ఆ సినిమా నిరాశపరచడంతో అది పెద్దగా క్రేజ్ తీసుకు రాలేదు. ఇక ఇదే కాకుండా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో వెంకటేష్ ఒక స్పెషల్ సర్ ప్రైజ్ రోల్ చేస్తున్నారు.
