Begin typing your search above and press return to search.

వెంకటేష్ సినిమాల్లో ఎక్కువ మంది ఇష్టపడే మూవీ ఇదే...

వెంకటేష్ సినిమాల్లో కామెడీ యాక్షన్స్ సీన్స్ మిళితమై ఉంటాయి. ఏ జానర్ లో సినిమా చేసిన అది వెంకటేష్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

By:  Gopi Velupala   |   14 Oct 2026 10:00 AM IST
వెంకటేష్ సినిమాల్లో ఎక్కువ మంది ఇష్టపడే మూవీ ఇదే...
X

ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో వెంకటేష్ సిద్ధహస్తుడు. ఆయన ఫ్యామిలీ తో వచ్చిన ప్రతిసారి థియేటర్లు కలకలలాడుతూ ఉంటాయి... చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెంకటేష్ సినిమాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. అందుకే అతనితో మూవీస్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిజానికి వెంకటేష్ ను ప్రొడ్యూసర్స్ హీరోగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే వెంకటేష్ సినిమా సక్సెస్ అయితే నిర్మాత కి భారీ లాభాలు వస్తాయి. తేడా కొట్టిన కూడా వాళ్లకు పెద్దగా లాసెస్ రావు. అందుకే వెంకటేష్ తో మూవీ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. వెంకటేష్ చేసిన సినిమాల్లో ఇప్పటివరకు చాలా ఎక్కువ మందికి నచ్చిన సినిమా ఏంటంటే 'నువ్వు నాకు నచ్చావ్'. వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కేవలం స్క్రిప్ట్ కి సరెండరై చేసిన సినిమా ఇదే. త్రివిక్రమ్ రాసిన పంచులకు వెంకటేష్ ప్రాణం పోశాడు. ఎలాంటి ఈగో లకు పోకుండా తన మీద తనే పంచులు వేసుకోగలిగే ఏకైక హీరో వెంకటేష్. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ చాలా జన్యూన్ గా ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసి హే గా నవ్వుకునేలా ఉంటుంది కాబట్టి ఈ సినిమా అంటే ప్రేక్షకులకు అమితమైన ఇష్టం. ఏ హీరో అభిమాని అయిన వెంకటేష్ సినిమాలను చూస్తారు.

యూనివర్సల్ హీరో...

వెంకటేష్ సినిమాల్లో కామెడీ యాక్షన్స్ సీన్స్ మిళితమై ఉంటాయి. ఏ జానర్ లో సినిమా చేసిన అది వెంకటేష్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనేలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే వెంకటేష్ ను యూనివర్సల్ హీరోగా చెబుతుంటారు.

మిగతా హీరోలు కొన్ని జానర్స్ లోనే సినిమాలు చేస్తూ వాళ్ళ స్టార్ డమ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేష్ మాత్రం క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసి సక్సెస్ లను సాధించాడు. ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడమే తన లక్ష్యం. అందుకే ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతున్నప్పటికి ఆయన స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ డిఫరెంట్ సబ్జెక్టులను డీల్ చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

గత సంవత్సరం వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టాడు అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం' మూవీ చేశాడు. ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ను వెంకటేష్ తన మేనరిజమ్స్ తో తన డైలాగ్స్ తో నవ్విస్తూనే యాక్షన్ సన్నివేశాల్లో సైతం అలరిస్తాడట. ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెంకటేష్ అభిమానులతో పాటు చాలామంది సగటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం...