మరో మూడేళ్లలో వారసుడు దిగే అవకాశం!
నిర్మాత రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ పెద్ద స్టార్ అయ్యారు. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
By: Srikanth Kontham | 20 Dec 2025 6:00 AM ISTనిర్మాత రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ పెద్ద స్టార్ అయ్యారు. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అన్ని జానర్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇతర స్టార్లతో కలిసి మల్టీస్టారర్ చిత్రా ల్లోనూ నటిస్తున్నారు. అదే కుటుంబం నుంచి తర్వాత తరం నటులుగా రానా, అభిరామ్ కూడా హీరోలగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రానా నిర్మాతగా బిజీగా ఉండటంతో? నటపై ఫోకస్ పెట్టలేదు. సరైన పాన్ ఇండియా కథల కోసం సెర్చ్ చేస్తున్నాడు. `అహింస`తో లాంచ్ అయిన తర్వాత అభిరామ్ కూడా స్టోరీ సెర్చింగ్ లో ఉన్నాడు.
విదేశాల్లో చదువులు:
అదే కుటుంబం నుంచి లాంచ్ అవ్వాల్సిన మరో వారసుడు కూడా ఉన్నాడు. అతడే వెంకటేష్ ఏకైక తనయుడు అర్జున్. వెంకటేష్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అర్జున్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఇప్పటికే అర్జున్ ఎంట్రీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అర్జున్ అమెరికాలో చదువుకుంటున్నాడు. హీరో వయసు వచ్చేసింది. ప్రస్తుతం అర్జున్ వయసు 21 ఏళ్లు. మరో రెండు ..మూడేళ్లలో అతడి చదువు పూర్తవుతుంది. ఈనేపథ్యంలో అర్జున్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అర్జున్ ఫోటోలు నెట్టింట ఎక్కడా దొరకవు.
అర్జున్ ప్రయివేట్ పర్సన్:
దీంతో అతడు ఎంత ప్రయివేట్ గా ఉంటాడు? అన్నది చెప్పొచ్చు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` రిలీజ్ సంద ర్బంగా ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో తొలిసారి మీడియా ముందుకొచ్చాడు. అప్పుడు అర్జున్ వయసు ఓ పదేళ్లు ఉండొచ్చు. ఆతర్వాత మళ్లీ అర్జున్ ఎక్కడా కెమెరాకి చిక్కలేదు. సెలబ్రిటీ ఫ్యామిలీ అంటే ఏదో రూపంలో పిక్స్ లీక్ అవుతుంటాయి. కానీ అర్జున్ అందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. వెరీ ప్రయివేట్ పర్సన్ గా ఉన్నాడు. అర్జున్ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అంటే ఆ విషయాలు కూడా కుటుంబ సభ్యులు ఎంతో గోప్యంగా ఉంచుతారు.
ఎందుకంత గోప్యత?
వస్తాడని చెప్పరు..రాడు అని చెప్పరు. అయితే ఇంత కాలం దాయడం వేరు. ఇకపై దాచడం వేరు. అర్జున్ 23-24 ఏళ్లు వచ్చిన తర్వాతైనా ఓపెన్ అవ్వక తప్పదు. వెంకటేష్ వయసు ఇప్పటికే 65 ఏళ్లు. కుమార్తెలిద్దరు పెళ్లిళ్లు చేసి తాతయ్య కూడా అయ్యారు. ఆ కుటుంబంలో చిన్నోడు అర్జున్ మాత్రమే. అతడిని నచ్చిన రంగం వైపు ప్రోత్సహిస్తే వెంకటేష్ బాధ్యత నెరవేరినట్లు అవుతుంది. మరి యాక్టింగ్ వైపు అర్జున్ ఆసక్తిగా ఉన్నాడా? లేడా? అన్నది తెలియాలి.
