Begin typing your search above and press return to search.

భవిష్యత్ గురించి అతిగా ఆలోచించకు.. వెంకీ మామ తత్వశాస్త్రం!

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆదర్శ కుటుంబం` సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   29 Sept 2026 9:24 PM IST
భవిష్యత్ గురించి అతిగా ఆలోచించకు.. వెంకీ మామ తత్వశాస్త్రం!
X

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆదర్శ కుటుంబం` సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది. ఈ ప్రత్యేక సందర్భంలో యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్- శ్రీనిధి శెట్టి పాల్గొన్నారు.

సినిమా విశేషాలు మాట్లాడుతూనే.. వెంకీ తన జీవిత తత్వశాస్త్రం గురించి చెప్పారు.. జీవితంలో అతిగా ఆశపడకుండా ప్రతిరోజూ ఏమరుపాటు లేకుండా క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడమే విజయానికి అసలు రహస్యమని వెంకటేష్ వివరించారు. భవిష్యత్తు గురించి అతిగా చింతించకుండా.. వర్తమానంలో శ్రద్ధ పెట్టి మిగిలిన ఫలితాన్ని విశ్వానికి (యూనివర్స్‌కు) వదిలేయాలని ఆయన సూచించారు. కష్టకాలంలోనూ చిరునవ్వుతో ఉంటూ అంతర్గత ప్రశాంతతను కాపాడుకోవాలని.. ఇతరులపై వేలెత్తి చూపకుండా ప్రతి దానికి మనమే బాధ్యత వహించాలని తెలిపారు.

తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. తన తండ్రి ఒంటరిగా ఉంటూ తమ ముగ్గురు పిల్లలను ఎలా పెంచారో భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. అమ్మ మరణం తరువాత తండ్రే (రామానాయుడు) తల్లీ, తండ్రి రెండు పాత్రలను పోషించి తమను ఎంతో చక్కగా తీర్చిదిద్దారని తెలిపారు. అలాగే తాను ఆహార‌ ప్రియుడినని.. ఏడు ఇడ్లీలు లేదా ఐదు వడలు సులభంగా తినగలనని నవ్వుతూ చెప్పడమే కాకుండా..సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ను కూడా ఎంతో సరదాగా ఆస్వాధిస్తానని పేర్కొన్నారు.

చివరిగా సినిమా విశేషాల గురించి చెబుతూ.. ఇందులో మంచి క్రైమ్, యాక్షన్‌తో పాటు విపరీతమైన కామెడీ - ఎమోషన్స్ ఉంటాయని తెలిపారు. థియేటర్‌లో ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని.. జీవితాన్ని ఎలాంటి గందరగోళాలకు తావులేకుండా చాలా సింపుల్‌గా ఆస్వాధించాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

సినిమా ప్రయాణం గురించి వెంకటేష్ మాట్లాడుతూ.. క్లాసిక్ - కల్ట్ సినిమాల కుటుంబ భావోద్వేగాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం సులభం కాదని తెలిపారు. అయితే ఈ చిత్రంలో కుటుంబ సంబంధాల భావోద్వేగాల మిశ్రమం తెలుగు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందని వెల్లడించారు. కేవలం నటన మాత్రమే కాకుండా.. ప్రతి స్క్రిప్ట్‌ను పాజిటివ్‌గా అంగీకరించడమే తన శైలి అని స్పష్టం చేశారు.