Begin typing your search above and press return to search.

M.S.Gలో వెంకటేష్.. క్యామియో కాదు..!

ఐతే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడన్న విషయం తెలిసిందే. MSG లో వెంకటేష్ ఏదో క్యామియో రోల్ అని అందరు అనుకున్నారు.

By:  Ramesh Boddu   |   8 Jan 2026 12:00 PM IST
M.S.Gలో వెంకటేష్.. క్యామియో కాదు..!
X

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు రాబోతుంది. ఎం.ఎస్.జి సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజైన హుక్ స్టెప్ సాంగ్ అయితే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. మెగా మేనియా ఏంటో చూపించేలా మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఏంటో చూపిస్తూ వచ్చిన హుక్ స్టెప్ సాంగ్ కచ్చితంగా థియేటర్ లో మెగా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు.

అనిల్ రావిపూడి హిట్ సెంటిమెంట్..

ఐతే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడన్న విషయం తెలిసిందే. MSG లో వెంకటేష్ ఏదో క్యామియో రోల్ అని అందరు అనుకున్నారు. అనిల్ రావిపూడి హిట్ సెంటిమెంట్ గా వెంకటేష్ ని ఈ సినిమాలో తీసుకున్నారు అనుకున్నారు కానీ వెంకటేష్ ఈ సినిమాలో క్యామియో కాదు ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఎం.ఎస్.జి సినిమాలో వెంకటేష్ రోల్ గురించి లేటెస్ట్ లీక్స్ వచ్చాయి. సినిమాలో మన వెంకీ మామ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటారట. అంతేకాదు సినిమా క్లైమాక్స్ లో చిరు, వెంకీ సాంగ్ ఫైట్ ఇవన్నీ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. వెంకటేష్ మన శంకర వరప్రసాద్ గారు కోసం 15 రోజుల దాకా డేట్స్ ఇచ్చారట. సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమాకు వెంకటేష్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారట.

చిరు కోసం వెంకటేష్..

అంతేకాదు మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ నటించినందుకు గాను 9 కోట్ల దాకా రెమ్యునరేషన్ కూడా ఇచ్చారట. సో ఎం.ఎస్.జి లో వెంకటేష్ రోల్ అదేదో క్యామియో అనుకున్నారు కానీ ఇది సినిమాలో ఒక రోల్ అని చిరు కోసం వెంకటేష్ ఆ రోల్ చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. వెంకటేష్ కెరీర్ మొదలైనప్పటి నుంచి చిరంజీవి మీద ఎంతో అభిమానంగా ఉంటూ వచ్చారు. అదే అభిమానంతోనే ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్ కలిసి సినిమా నటించారు.

ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు కలిసి చేసే హంగామా పండగ వైబ్ ని మరింత స్పెషల్ చేస్తుందని చెప్పొచ్చు. మన శంకర వర ప్రసాద్ సినిమాలో వింటేజ్ చిరంజీవి చూస్తారంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెబుతున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ఏమేరకు మెగా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది అన్నది చూడాలి. ఎం.ఎస్.జి తో పాటు మరో నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో దిగుతున్నాయి. ఈ సినిమాలన్నింటితో ఈసారి ఫెస్టివల్ మరింత కలర్ ఫుల్ గా మారబోతుందని చెప్పొచ్చు.