Begin typing your search above and press return to search.

పాతికేళ్ల ప్రెజర్.. త్రివిక్రమ్ కాంబోపై వెంకీ మాట

హైదరాబాద్ శిల్పకళా వేదికపై జరిగిన 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ స్పీచ్ అదిరిపోయే జోష్ నింపింది.

By:  M Prashanth   |   27 Oct 2026 11:28 PM IST
పాతికేళ్ల ప్రెజర్.. త్రివిక్రమ్ కాంబోపై వెంకీ మాట
X

హైదరాబాద్ శిల్పకళా వేదికపై జరిగిన 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ స్పీచ్ అదిరిపోయే జోష్ నింపింది. మైక్ అందుకున్న వెంటనే వెంకీ.. మాటల మాంత్రికుడి తర్వాత మాట్లాడటం కష్టమంటూనే అసలు విషయాన్ని బయటపెట్టారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి తర్వాత పాతికేళ్లకు మా కలయిక జరుగుతోంది.. ఇలాంటి టైమ్ లో ఎలాంటి సినిమా చేయాలనే దానిపై నాపై, త్రివిక్రమ్ పై విపరీతమైన ఒత్తిడి ఉండేదంటూ ఇండస్ట్రీ రియాలిటీని ఒప్పుకున్నారు.

కామెడీతో పాటు ఊహించని సస్పెన్స్, ఎమోషన్స్ ఉన్న కథను త్రివిక్రమ్ తెచ్చేదాకా ఇద్దరం ఆగామని చెప్పారు. ఈ వేదికపై తన పాత బ్లాక్‌బస్టర్లను గుర్తుచేస్తూ వెంకీ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎన్నో కుటుంబ కథా చిత్రాలు చేశాను.. రాజా, సూర్యవంశం, వసంతం, కలిసి ఉందాం రా సినిమాల్లో అందరినీ ప్రేమించాను, కలిసి బతకడం చూశాను.. ఈ ఆదర్శ కుటుంబం ఏకే 47 వాటన్నిటికంటే చాలా ప్రత్యేకం, నా ఫ్యామిలీ కోసం ఏం జరిగినా సరే కాపాడుకుంటాను అంటూ ఆయన స్వయంగా వెల్లడించారు. ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథల నుంచి రక్షణ కోసం తెగించే స్థాయికి తన క్యారెక్టర్ ఎలా మారిందో ఆయన మాటల్లోనే అర్థమైంది.

వెంకీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలతో టైటిల్ వెనుక దాగివున్న అసలైన వైలెంట్ కోణం బయటపడింది. సాధారణ ఫ్యామిలీ డ్రామాల్లోలాగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోకుండా, ఇంటి జోలికి ఎవరైనా వస్తే ఒక సామాన్యుడు ఎదురుతిరిగి కాపాడుకునే సంఘర్షణను ఇందులో చూపించబోతున్నట్లు ఆయన క్లూ ఇచ్చేశారు. ఆదర్శ కుటుంబం పక్కన ఏకే 47 అనే గన్ పేరును ఎందుకు తగిలించారో ఈ వివరణతో ఒక అవగాహన వచ్చేసింది. కుటుంబ రక్షణ కోసం ఒక ఫ్యామిలీ మ్యాన్ చేసే పోరాటమే ఈ కథకు అసలైన బలం అని తేలిపోయింది.

సినిమా ఫలితంపై వెంకటేష్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఈవెంట్‌కే హైలైట్ గా నిలిచింది. అక్కడ గ్రౌండ్ లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి సిక్సర్లు కొట్టేస్తున్నారు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సిక్సర్లు, సెంచరీలు కొడుతుంది అంటూ నవ్వుతూనే పక్కా ధీమా చూపించారు. ఎప్పుడూ కామ్ గా ఉండే వెంకీ ఇంత దూకుడుగా సిక్సర్ల ఛాలెంజ్ విసరడం థియేటర్లలో బొమ్మ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెప్పింది.

షూటింగ్ పూర్తవగానే రిలాక్స్ అవ్వకుండా, ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం పడ్డ కష్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయానని, రీ రికార్డింగ్ పూర్తయ్యే వరకు స్వయంగా తానే రోజూ సాయంత్రం స్టూడియోకి వెళ్లినట్లు తెలిపారు. సీనియర్ స్టార్ అయి ఉండి మ్యూజిక్ సిట్టింగ్స్ లో గంటల తరబడి గడపడం అవుట్‌పుట్ పై టీమ్ పెట్టుకున్న ఫోకస్ హైలెట్ అవుతోంది.

సినిమా ఆడినా ఆడకపోయినా రోజూ పొద్దున్నే లేచి లోకం బాగుండాలని కోరుకుంటాను, ఫలితాన్ని వదిలేసి లెట్ గో అనుకుని పనులు చేస్తానంటూ తన లైఫ్ ఫిలాసఫీని కూడా పంచుకున్నారు. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లే వెంకీ మామ, వింటేజ్ త్రివిక్రమ్ కాంబోతో కొట్టబోతున్న ఆ సిక్సర్ థియేటర్లలో ఏ రేంజ్ లో పేలుతుందో అక్టోబర్ 30న చూడాలి.