ఆదర్శ కుటుంబం.. ఈ గ్లామర్ డోస్ కూడా ఉందా..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై మొదట్లో ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
By: M Prashanth | 19 Oct 2026 9:14 PM ISTవిక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై మొదట్లో ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ వరుసగా వచ్చిన అప్డేట్స్ అంతగా క్లిక్ కాలేకపోవడంతో రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ కు మళ్లీ ఫ్రెష్ బజ్ తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పాటలు వదులుతూ హైప్ పెంచే పనిలో పడ్డారు.
తమన్ కంపోజ్ చేసిన మొదటి పాట తర్వాత, ఇప్పుడు మాలా అంటూ సాగే రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ చూడగానే ఇదొక పక్కా క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, దానికి కాస్త యాక్షన్ టచ్ ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ మాలా పాట చూస్తుంటే మాత్రం ఇందులో గ్లామర్ డోస్ కూడా గట్టిగానే హైలైట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు గ్లామర్ ట్రీట్ ను కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంటారు. మరి ఈ సినిమాలో ఆ గ్లామర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. పాటలోని విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. వెంకటేష్ తన మార్క్ హుషారైన ఎనర్జీతో నివేదా పేతురాజ్ తో కలిసి వేసిన స్టెప్పులు బాగున్నాయి.
రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్, ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డి కలిసి ఈ పాటను పాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు తగ్గట్టుగా మంచి జోష్ నింపింది. అయితే ఆడియో పరంగా చూస్తే ఈ పాటపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాట వినడానికి బాగుందని, మంచి ఊపు ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఈ క్రేజీ కాంబినేషన్ కు తమన్ నుంచి ఇంకా బెటర్ ట్యూన్ పడి ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు.
అంతేకాకుండా ఈ ట్యూన్ వింటుంటే గతంలో ఎక్కడో విన్నట్లు ఉందే అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి వస్తున్నాయి. మొదటి రోజు రెస్పాన్స్ తోనే పాట స్థాయిని డిసైడ్ చేయడం కష్టమే. ఈ మధ్య కాలంలో చాలా పాటలు వినగా వినగా జనాలకు ఎక్కుతున్నాయి. కాబట్టి ఈ మాలా సాంగ్ ఆడియన్స్ కు నిజంగానే కనెక్ట్ అయిందా, సోషల్ మీడియాలో క్లిక్ అయిందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఆ తర్వాతే పాట అసలు రీచ్ ఏంటో క్లారిటీ వస్తుంది.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ లాంటి పెద్ద తారాగణమే ఉంది. రెండు పాటలతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర బృందం, త్వరలోనే స్పెషల్ ట్రైలర్ ను కూడా వదిలేందుకు రెడీ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ పాట సినిమాకు ఎంతవరకు బజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
