వెంకీ మామ అనుసరించే నాలుగు జీవిత సూత్రాలు
ఇంతలోనే ఆశ్రిత- వెంకీ మామ మధ్యలో ప్రవేశించాడు షో హోస్ట్ దగ్గుబాటి రానా. ఈ పాఠాలు ఆశ్రితకు చెబుతున్నారా లేక పరోక్షంగా నాకు చెబుతున్నారా? అంటూ బాబాయ్ వెంకటేష్ ని రానా సరదాగా ప్రశ్నించారు.
By: Sivaji Kontham | 4 Jan 2026 9:00 PM ISTదాదాపు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు దగ్గుబాటి వెంకటేష్. అక్కినేని నటించిన `ప్రేమనగర్` సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు వెంకీ. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించారు. `కలియుగ పాండవులు`(1972) అనే చిత్రంతో వెంకీ టాలీవుడ్ లో హీరోగా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ నాలుగు దశాబ్ధాలలో ఆయన ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లలో నటించారు. నటనలో సుదీర్ఘ అనుభవం ఘడించారు. అంతేకాదు ఎన్నో జీవితపాఠాలు కూడా ఆయన సొంతం. లైఫ్ లో ఆధ్యాత్మికత ప్రాముఖ్యత గురించి వెంకీ చాలా పాఠాలు చెబుతుంటారు.
అందుకే విక్టరీ వెంకటేష్ తన ఇంటర్వ్యూలలో రెగ్యులర్‌గా చెప్పే `జీవిత సూత్రాలు` అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం ఆయన ఏ నాలుగు సూత్రాలను పాటిస్తారో గతంలో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం `మన శంకర వరప్రసాద్ గారు` సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఆయన షూటింగ్ బాధలు మరిచిపోయి, ఇప్పుడు సినిమా రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తన కుమార్తె ఆశ్రితతో ప్రైమ్ వీడియోలో `ది రానా దగ్గుబాటి షో` కోసం అటెండయ్యారు. షోలో కుమార్తెతో మరోసారి వెంకీ మామ ఆ నాలుగు సూత్రాల గురించి ప్రస్థావించారు. ఎగ్జాక్ట్ - సబ్ మిట్ -ఎగ్జిట్ -యాక్సెప్ట్ అంటూ జీవితంలో పాటించాల్సిన నాలుగు సూత్రాలను వెంకీ చెప్పారు.
ఆయన తనదైన శైలిలో చెబుతూ... మొన్ననే సినిమా పూర్తి చేసాం.. ఇది ఎగ్జాక్ట్. అది రిలీజవుతుంది.. అంటే సబ్ మిట్. అన్నిటినీ పూర్తి చేసి వేచి చూడటమే ఎగ్జిట్. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా అంగీకరించడం యాక్సెప్ట్.. అంటూ వెంకీ తనదైన శైలిలో వివరించారు. మొదటి రెండు సూత్రాలు ఎంత ముఖ్యమో, ఆ తర్వాతి రెండు సూత్రాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెండిటినీ ఎక్కువమంది అనుసరించరు. ఫలితాన్ని అంగీకరించలేకపోవడమే అన్ని టెన్షన్లకు కారణం. సంక్రాంతికి నా సినిమా వస్తోంది. ఆ సినిమా పూర్తి చేసి ఎగ్జిట్ అయ్యాను. ఇక రిజల్ట్ ఏం వచ్చినా అంగీకరిస్తాను! అని వెంకీ స్పష్ఠంగా ఆ నాలుగు రూల్స్ గురించి వివరించారు.
ఇంతలోనే ఆశ్రిత- వెంకీ మామ మధ్యలో ప్రవేశించాడు షో హోస్ట్ దగ్గుబాటి రానా. ఈ పాఠాలు ఆశ్రితకు చెబుతున్నారా లేక పరోక్షంగా నాకు చెబుతున్నారా? అంటూ బాబాయ్ వెంకటేష్ ని రానా సరదాగా ప్రశ్నించారు. ఈ లెస్సన్స్ నీక్కూడా! అంటూ వెంకీ సరదాగా నవ్వేసారు. ఆ ముగ్గురి మధ్యా సరదా సంభాషణలతో ది రానా దగ్గుబాటి షో ఎంతో ఫన్ ఎలివేషన్ తో సాగిపోనుందని అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ షో సంక్రాంతి కానుకగా ప్రసారం కానుంది. ప్రోమో ఆకట్టుకుంది. వెంకీ మామ పాఠాలతో షో ఆద్యంతం రక్తి కట్టిస్తుందని అర్థమవుతోంది. అదే విధంగా సంక్రాంతి బరిలో వస్తున్న మన శివశంకరవరప్రసాద్ గారు కూడా రక్తి కట్టిస్తుందనే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రాజమౌళి, రిషబ్ శెట్టి, నాగచైతన్య, నాని, సిద్ధు జొన్నల గడ్డ సహా చాలా మంది ప్రముఖులతో ఇప్పటికే ఎపిసోడ్లు తెరకెక్కిన సంగతి తెలిసిందే.
యువత తప్పక నేర్చుకోవాల్సినవి:
వెంకీ జీవిత అనుభవాల ప్రకారం.. ఎగ్జిట్ అంటే వేరొక అర్థం ఉంది. మీకు ఏదైనా ఒక ప్రదేశం, పరిస్థితి లేదా ఒక వ్యక్తితో ఉన్న సంబంధం నచ్చకపోయినా లేదా అక్కడ మీకు గౌరవం లేకపోయినా సాధ్యమైతే అక్కడి నుండి వెళ్ళిపోండి.. అంటే ఆ సమస్య నుండి బయటకు వచ్చేయడం మొదటి మార్గం.
యాక్సెప్ట్ అంటే.. ఒకవేళ మీరు ఆ పరిస్థితి నుండి బయటకు రాలేని పక్షంలో (ఎగ్జిట్ అవ్వడం కుదరకపోతే).. ఆ పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అంగీకరించండి. ``ఇది ఇంతే, దీన్ని నేను భరించాలి`` అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే సగం ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఛేంజ్ అనే సూత్రం కూడా ఉంది. దీని ప్రకారం.. మీరు ఆ పరిస్థితిని అంగీకరించలేకపోతే, దానిని మార్చడానికి ప్రయత్నించండి. మీకు నచ్చినట్లుగా ఆ పరిస్థితులను లేదా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. నాలుగో రూల్ లో స్మైల్ కూడా ఇమిడి ఉంది. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వలేక, అంగీకరించలేక, కనీసం మార్చలేకపోయినా.. అప్పుడు చేయగలిగింది ఒక్కటే. చిరునవ్వుతో ఉండటం. ఇది నా విధి, దీన్ని మార్చలేను! అని ఒక చిన్న నవ్వు నవ్వి ఆ విషయాన్ని వదిలేయాలి.
దీని సారాంశం ఏమిటి? అంటే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. తప్పుకో. కుదరకపోతే అంగీకరించు. అదీ కుదరకపోతే మార్చు. ఏదీ చేయలేకపోతే నవ్వి ఊరుకో.. విక్టరీ వెంకటేష్ అనుసరించే ఈ ఫిలాసఫీ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఆయన ఇతర ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా అల్టిమేట్ అని అంగీకరిస్తారు ఎవరైనా!
