Begin typing your search above and press return to search.

అనిల్‌ కథలో మళ్లీ ఆర్మీ హీరో.. వెంకీ పవర్ఫుల్ లుక్

వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తను చేస్తున్న కొత్త సినిమా నుంచి మేకర్స్ ఒక స్పెషల్ ఫస్ట్ లుక్ వదిలారు.

By:  M Prashanth   |   14 Aug 2026 9:33 PM IST
అనిల్‌ కథలో మళ్లీ ఆర్మీ హీరో.. వెంకీ పవర్ఫుల్ లుక్
X

వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తను చేస్తున్న కొత్త సినిమా నుంచి మేకర్స్ ఒక స్పెషల్ ఫస్ట్ లుక్ వదిలారు. ఇందులో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపిస్తున్నాడు. ఆర్మీ యూనిఫామ్ వేసుకుని, కళ్లజోడు పెట్టుకుని ఒక కారు పక్కన నిలబడిన వెంకీ లుక్ చాలా రగ్గడ్‌గా ఉంది.




పోస్టర్‌పై ఉన్న డిటైల్స్ గమనిస్తే ఈ క్యారెక్టర్‌ స్పెషలైజేషన్ కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్ అని రాశారు. అంటే తీవ్రవాదుల బారి నుంచి బందీలను విడిపించే సీరియస్ ఆపరేషన్లను డీల్ చేసే స్ట్రిక్ట్ ఆఫీసర్ పాత్ర అని అర్థమవుతోంది. ఈ లుక్, ఆ మిలిటరీ ప్రొఫెషన్ చూస్తుంటే దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్న గత సినిమాలతో ఒక చిన్న కనెక్షన్ క్లియర్ గా కనిపిస్తోంది.

సీరియస్ జాబ్ చేసే హీరోతోనే ఎంటర్‌టైన్‌మెంట్ రాబట్టడం అనిల్ కు కొత్తేమీ కాదు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరో మేజర్ అజయ్ కృష్ణ. ఆ స్ట్రిక్ట్ మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌ను రెగ్యులర్ ఫ్యామిలీ కామెడీకి లింక్ చేసి థియేటర్లలో నవ్వించాడు. ఆ క్యారెక్టరైజేషన్, ఫార్ములా బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అయింది.

ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో వైడి రాజు అనే మాజీ పోలీస్ పాత్ర చేయించాడు. అందులో కూడా ఒక సీరియస్ రెస్క్యూ మిషన్ చుట్టూనే అనిల్ కామెడీ నడుస్తుంది. ఇప్పుడు మళ్లీ అదే వెంకటేష్‌కు అంతకంటే సీరియస్ డ్యూటీ చేసే లెఫ్టినెంట్ కల్నల్ క్యారెక్టర్‌ను సెట్ చేశాడు. ఇలా వరుసగా యూనిఫామ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుని పండగ బరిలోకి దిగుతున్నాడు.

క్యారెక్టర్ ప్రొఫెషన్ ఆర్మీ అయినంత మాత్రాన ఇది పూర్తి స్థాయి మిలిటరీ డ్రామా కాదు. మేకర్స్ దీన్ని పక్కా సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గానే జనాల్లోకి ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ సీరియస్ ఆపరేషన్స్ డీల్ చేసే వెంకట్ రెడ్డి క్యారెక్టర్‌ను అనిల్ రావిపూడి తన ఫన్ కోసం ఎలా వాడుకుంటాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కౌంటర్ టెర్రరిజం టెన్షన్, ఫన్ సీన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో థియేటర్లో చూడాలి.

ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. స్క్రీన్ మీద వీళ్లిద్దరూ కలిసి నటించడం కెరీర్ లో ఇదే తొలిసారి. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.