Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రు క్యాట్ కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలా?

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదీ ప‌క్కా గురూజీ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్.

By:  Srikanth Kontham   |   2 Dec 2025 7:00 AM IST
వాళ్లిద్ద‌రు క్యాట్ కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలా?
X

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదీ ప‌క్కా గురూజీ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్. వెంక‌టేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ‌. సినిమాలో వెంకీ పాత్ర పేరు వెంక‌ట‌ర‌మ‌ణ అంటూ ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. అదే నిజ‌మైతే వెంక‌ట‌ర‌మ‌ణ పాత్ర‌లో హాస్యం ప‌తాక స్థాయిలోనే ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా క‌న్న‌డ న‌టి శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసారు. ఇంకా వెంక‌టేష్ షూట్ లో జాయిన్ కాలేదు. చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` లో వెంకీ ఓ కీల‌క పాత్ర పోషించ‌డంతో? ఆ సినిమా షూటింగ్ లోబిజీగా ఉన్నారు.

మల్లీశ్వ‌రితో స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్:

ఆ షూట్ ముగిసిన అనంత‌రం త్రివిక్ర‌మ్ సినిమా షూట్ లో పాల్గొంటారు. ఈనేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ ను కూడా భాగం చేయాల‌ని గురూజీ ప్లాన్ చేస్తున్నాడుట‌. వెంకటేష్‌-క‌త్రినా కాంబినేష‌న్ తెర‌పై క‌నిపిస్తే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు లీకుల‌దుతున్నాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు. వెంకటేష్ హీరోగా న‌టించిన `మ‌ల్లీశ్వ‌రి` తోనే క‌త్రినా కైఫ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. న‌టిగా ఆమె ప్ర‌యాణం మొద‌లైంది ఈ చిత్రంతోనే.

పాపుల‌ర్ అయిన న‌టి కావ‌డంతోనే:

ఆ సినిమాలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌న్నివేశాలు ఎంత గొప్ప‌గా పండాయో తెలిసిందే. రెండు పాత్ర‌లు ప‌ర్పెక్ట్ టైమింగ్ తో ఆక‌ట్టుకుంటాయి. ఆ సినిమాకు డైలాగులు రాసింది గురూజీనే. ఈ నేప‌థ్యంలో తాజా సినిమాలో క్యాట్ తో ఓ రోల్ చేయిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుంటే మార్కెట్ ప‌రంగానూ క‌లిసొస్తుంది. ఇండియాలో ఇప్పుడామె ఫేమ‌స్ హీరోయిన్. ఆమెకంటూ ప్ర‌త్యేక‌మైన ప్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయిన న‌టి. ఆమె బ్రాండ్ తో సినిమాను ఆడించగ‌ల స‌త్తా ఉన్న న‌టి.

గెస్ట్ రోల్ ఆఫ‌ర్ చేస్తున్నారా?

ఇవ‌న్నీ విశ్లేషించే గురూజీ కీల‌క పాత్ర కుద‌ర‌ని ప‌క్షంలో క‌నీసం గెస్ట్ రోల్ కైనా ఒప్పించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి ఈ ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. వాస్త‌వానికి `మ‌ల్లీశ్వ‌రి` త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు తెలుగు సినిమా ఆఫ‌ర్లు క‌ల్పించారు. కానీ క‌త్రినా కైఫ్ బాలీవుడ్ పై దృష్టి పెట్టి తెలుగు సినిమాను లైట్ తీసుకుంది. కానీ తెలుగు సినిమా పాన్ ఇండియాని ఎల్తోన్న నేప‌థ్యంలో అక్క‌డ న‌టులంతా ఇటువైపు చూస్తున్నారు. మ‌రి జాబితాలో క్యాట్ ఉందా? లేదా? అన్న‌ది ఈ స‌న్నివేశంతో తేలిపోతుంది.