Begin typing your search above and press return to search.

గోదారి గట్టు రేంజ్‌లో ఒకటి వదలనున్న రావిపూడి..!

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల' సినిమాపై అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.

By:  Ramesh Palla   |   11 Sept 2026 5:07 PM IST
గోదారి గట్టు రేంజ్‌లో ఒకటి వదలనున్న రావిపూడి..!
X

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల' సినిమాపై అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. షూటింగ్‌ ప్రారంభం సమయంలో చేసిన వీడియోలు, టైటిల్‌ రివీల్‌ కోసం చేసిన వీడియోల కారణంగా సినిమా మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈసారి వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌లు కలిసి చేసే సందడి అంతా ఇంతా ఉండదని అనిల్‌ రావిపూడి అంటున్నాడు. ఇక హీరోయిన్స్‌గా నటిస్తున్న కీర్తి సురేష్‌, కృతి శెట్టి సైతం ఇంతకు ముందు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్స్‌ ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిల తరహాలో వినోదాన్ని పంచడం ఖాయం అని ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్‌ అందిస్తున్నాడు. మొదటి సారి జీవీ ప్రకాష్ కుమార్‌తో అనిల్‌ రావిపూడి వర్క్ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో...

సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్‌ సినిమాలకు సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి సంగీత దర్శకుడిని మార్చడం ద్వారా అంతకు మించి ఆశిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జీవీ ప్రకాష్ కుమార్‌ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బంలు కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమాతో మరోసారి జీవీ తన సత్తా చాటుతాడనే నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ మధ్య సంగీత దర్శకుడితో కలిసి అనిల్‌ రావిపూడి ఒక ఫన్నీ వీడియోను చేసిన సమయంలోనే కొన్ని పాటల ట్యూన్స్ ను రెడీ చేశారట. ఇప్పుడు ఒక పాటను విడుదల చేయడం కోసం రెడీ చేస్తున్నారు అంటూ యూనిట్‌ సభ్యుల నుంచి లీక్‌ అందుతోంది.

జనవరి 12 విడుదల సినిమా...

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్‌ గారు సినిమా మొదటి పాట మీసాల పిల్లను గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి పాట ఓ రేంజ్‌లో చాట్‌ బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలు పెంచింది. దాదాపు మూడున్నర నెలల ముందు ఆ పాటను విడుదల చేయడం ద్వారా బాగా కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు జనవరి 12 విడుదల సినిమా పాటను సైతం ముందుగానే విడుదల చేయాలని అనిల్‌ రావిపూడి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కు అనిల్‌ చెప్పడం, ఆయన ఒక పాటను రెడీ చేయడం జరిగిందట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పండుగకి ఈ సినిమా పాటలు ట్రెండ్‌ అయ్యేలా అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నాడు.

జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం...

అనిల్‌ రావిపూడి సినిమా అంటే ప్రమోషన్స్ పీక్స్‌ లో ఉంటాయి అనే విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. ముందు నుంచే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడానికి స్కిట్స్‌ చేస్తూ, వీడియోలు రూపొందిస్తూ ఉన్నాడు. ఈసారి పాటలతో మరింతగా సినిమాకు రీచ్ వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌ కాంబో సీన్స్‌ ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ ను మెప్పిస్తాయో అలాగే వీరిద్దరి కాంబోలో ఉండే పాట సైతం ఎవర్‌ గ్రీన్‌ అన్నట్లుగా నిలిచే విధంగా ఉండాలని జీవీతో అనిల్‌ చెప్పాడట. అందుకు తగ్గట్లుగా జీవీ ప్లాన్‌ చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాతో మరోసారి మ్యూజికల్‌ మ్యాజిక్‌ ను అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నాడు. మొదట వచ్చే పాటతో అందరికి సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు.