Begin typing your search above and press return to search.

రావిపూడి.. నువ్వు వేరే లెవల్ బాబు

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు తీయడంలోనే కాదు ప్రమోషన్స్ చేయడంలో కూడా తనదైన స్టైల్ చూపిస్తారు.

By:  M Prashanth   |   21 Jun 2026 5:11 PM IST
రావిపూడి.. నువ్వు వేరే లెవల్ బాబు
X

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు తీయడంలోనే కాదు ప్రమోషన్స్ చేయడంలో కూడా తనదైన స్టైల్ చూపిస్తారు. కేవలం ఎంటర్టైన్మెంట్ తో సినిమాను తెరకెక్కించడమే కాకుండా దాన్ని మొదట్నుంచి జనాల్లోకి తీసుకెళ్లడానికి ఫన్నీ స్కిట్స్ డిజైన్ చేస్తారు. లేటెస్ట్ గా వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ రోజు కూడా ఇలాంటి ఫన్నీ వీడియోతోనే నవ్వించారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ లు బావ బామ్మర్దులుగా నటిస్తున్నారు. వెంకీకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ కు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ కాస్ట్ తో సినిమా అనౌన్స్ మెంట్ రాగానే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక షూటింగ్ ప్రారంభం సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడి ఒక కత్తి పట్టుకుని ఫ్యాన్స్ ఇచ్చారు అని ఒక ఐడియా కావాలని హడావుడి చేశాడు.

ఇక వెంకీ చేతిలో పెట్టగానే రావిపూడి చెయ్యి కోయడం ఆ తరువాత పోటాపోటీగా కళ్యాణ్ రామ్ హీరోయిన్స్ కూడా కోయడం హైలెట్ అయ్యింది. ఈ సీన్ తో అనిల్ మరోసారి తన మార్క్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫన్నీ మూమెంట్ తర్వాత డైరెక్టర్ సినిమా బ్యాక్ డ్రాప్ ను రివీల్ చేశారు. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు.

అయితే రాయలసీమ అనగానే కేవలం ఫ్యాక్షన్, రక్తపాతం మాత్రమే కాకుండా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో నవ్వుల కోలాటంగా ఈ సినిమా ఉండబోతోందని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్ కుమార్ పని చేస్తున్నారు. ఆయనను కూడా ఇంతకు ముందు ఒక బీచ్ లో ఇసుకలో పాతిపెట్టిన ఫన్నీ స్కిట్ ద్వారా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ తో నెటిజన్లు కంటెంట్ కింగ్ అని బిరుదులను ఇచ్చేస్తున్నారు. రావిపూడి నువ్వు వేరే లెవెల్ బాబు అంటూ మరికొందరు చెబుతున్నారు.

సాహు గారపాటి నిర్మాణ సారథ్యంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ సినిమాను 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి రావిపూడి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.