గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలోని మొదటి పాటను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ ఇప్పటికే పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2028లో ఎన్టీఆర్‌తో అనిల్ సినిమా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By: Ramesh Palla | 18 Nov 2026 1:16 PM IST2027 సంక్రాంతి పండుగ కొన్ని నెలలు ఉండగానే తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి అనగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలతో వచ్చాడు. ఆ రెండు సినిమాలు ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండానే కేవలం తెలుగు వర్షన్‌తో ఏకంగా రూ.300 కోట్లు అంతకు మించి వసూళ్లు చేసిన సినిమాలుగా రికార్డ్ సృష్టించాయి. రాజమౌళి సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డ్‌లను అనిల్ రావిపూడి తన సంక్రాంతి సినిమాలతో సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన నుంచి 2027 సంక్రాంతికి రాబోతున్న 'జనవరి 12 విడుదల' సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
సంక్రాంతికి జనవరి 12 విడుదల సినిమా...
వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించబోతుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు బావ బామ్మర్థి కావడంతో వినోదం పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌కి అక్కగా లేదా చెల్లిగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. వీరిద్దరి కాంబో సీన్స్ ఫుల్ టు కామెడీ అన్నట్లుగా ఉండబోతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతే కాకుండా వెంకటేష్, కీర్తి సురేష్ కాంబోలో వచ్చే సీన్స్ సైతం గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాను గుర్తు చేస్తాయని అంటున్నారు. మొత్తానికి సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో సినిమా నుంచి ఎప్పుడు ప్రమోషనల్ స్టఫ్ విడుదల అవుతుందా, పాటలు ఎప్పుడు వస్తాయా అని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్...
అనిల్ రావిపూడి గత సంక్రాంతి సినిమాలు అయిన సంక్రాంతికి వస్తున్నాం నుంచి మొదటి పాటను డిసెంబర్ నెలలో విడుదల చేయగా, మన శంకరవర ప్రసాద్ గారు సినిమా మొదటి పాటను మూడు నెలల ముందుగానే అంటే అక్టోబర్‌లోనే విడుదల చేయడం జరిగింది. ఆ రెండు పాటల వల్ల సినిమాల యొక్క మార్కెట్ డబుల్ అయింది, ప్రేక్షకుల్లో అంచనాలు రెండు మూడు రెట్లు పెరిగాయి అనడంలో సందేహం లేదు. అందుకే అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమా మొదటి పాట విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో జనవరి 12 విడుదల సినిమా నుంచి మొదటి పాట విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను చిన్న కామెడీ స్కిట్‌గా రెడీ చేశారని కూడా యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి మూవీ...
జనవరి 12 విడుదల సినిమా క్రేజ్ ఇప్పటికే పీక్స్‌లో ఉంది. మొదటి పాట గోదారి గట్టు, మీసాల పిల్ల తరహాలో ఉంటే ఇంకా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాతో అనిల్ రావిపూడి సంక్రాంతి హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి అంటే అనిల్... అనిల్ అంటే సంక్రాంతి అనే విధంగా జనవరి 12 విడుదల సినిమా నిలువబోతుందనే విశ్వాసంను వెంకటేష్, కళ్యాణ్ రామ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏమాత్రం ఆలోచన లేకుండా, నెల గ్యాప్ లోనే ఎన్టీఆర్‌తో, అనిల్ రావిపూడి మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 2028లో ఎన్టీఆర్ మూవీతో అనిల్ రావిపూడి రానున్నాడు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి ఇంతకు ముందు మల్టీస్టారర్‌తో వచ్చి హిట్ కొట్టిన కారణంగా ఈ సినిమాతోనూ కచ్చితంగా సక్సెస్‌ను దక్కించుకుని, మరోసారి సంక్రాంతి సీజన్‌పై తన ఆదిపత్యం కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
