ఫ్యామిలీ హీరో నుంచి వెర్సటైల్ స్టార్.. వెంకటేష్ కొత్త స్ట్రాటజీ!
త్రివిక్రమ్ అనగానే గుర్తొచ్చే చమత్కారమైన డైలాగులు, గుండెకు హత్తుకునే కుటుంబ విలువలు ఈ సినిమాలో పీక్స్‌లో ఉండబోతున్నాయట.
By: Madhu Reddy | 27 Jun 2026 6:00 PM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, మన విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్. అయితే, ఈసారి ఆయన రూట్ మార్చారు. కేవలం ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా.. టాలీవుడ్‌లోని నలుగురు టాప్ డైరెక్టర్లతో నాలుగు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓకే చేసి అందరినీ షాక్‌కి గురిచేస్తున్నారు. క్లాస్, మాస్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్ దగ్గర గట్టిగా ప్లాన్ చేసిన వెంకయ్య కొత్త స్ట్రాటజీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..
త్రివిక్రమ్ మార్క్ ‘ఆదర్శ కుటుంబం’:
వెంకటేష్ లైనప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. త్రివిక్రమ్ అనగానే గుర్తొచ్చే చమత్కారమైన డైలాగులు, గుండెకు హత్తుకునే కుటుంబ విలువలు ఈ సినిమాలో పీక్స్‌లో ఉండబోతున్నాయట. వెంకీ మార్క్ నటనకు త్రివిక్రమ్ రైటింగ్ తోడైతే థియేటర్లలో నవ్వులు, ఎమోషన్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.
అనిల్ రావిపూడితో ఫుల్ లెంగ్త్ కామెడీ:
వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘F2’, ‘F3’ సినిమాలతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఈ జోడి, తాజాగా మరో ఫుల్ లెంగ్త్ కామెడీ కళ్యాణ్ రామ్, వెంకటేష్ తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ టైమింగ్, వెంకీ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి.
వశిష్ట డైరెక్షన్‌లో భారీ యాక్షన్ డ్రామా:
బింబిసార, విశ్వంభర చిత్రాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇక ఇదొక భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్. ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ లో చూసే వెంకటేష్‌ను వశిష్ట ఒక పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో గట్టిగా ఉంది.
దర్శకుడు బాబీతో పక్కా మాస్ హంగామా:
వెంకటేష్ కేవలం క్లాస్ సినిమాలే కాదు.. మాస్ ఆడియన్స్‌ను కూడా ఊపేయడానికి రెడీ అయ్యారు. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వెంకీ ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘వెంకీ మామ’ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబో రిపీట్ కానుండటంతో మాస్ ఫ్యాన్స్‌కు ఇదొక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి.
వయసుతో సంబంధం లేకుండా ఈ తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వెంకటేష్ సెట్ చేసుకున్న ఈ ఫోర్-మూవీ లైనప్ నిజంగా గ్రేట్ అనిపించక మానదు. ఒకే సమయంలో నలుగురు క్రేజీ దర్శకులను లైన్‌లో పెట్టడం వెంకటేష్ బిజినెస్ స్ట్రాటజీకి నిదర్శనం. ఇక ఈ నాలుగు సినిమాలు గనుక బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే వెర్సటైల్ స్టార్‌గా వెంకటేష్ రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయం.
