వెంకీ సార్ వెరీ మచ్ సెలెక్టివ్..!
ఐతే దృశ్యం 3 తో పాటు వెంకటేష్ తో సినిమా చేయాలనే ప్లాన్ ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు.
By: Ramesh Boddu | 7 Dec 2025 12:00 PM ISTసంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వెంకటేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఇద్దరు కలిసి రెండు దశాబ్దాల క్రితం పనిచేశారు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడే వెంకటేష్ తో సూపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ ఇద్దరు కలిసి చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
వెంకటేష్ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేయాలని..
2026 సమ్మర్ కి రిలీజ్ చేసేలా వెంకటేష్ గురూజీ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడన్న సస్పెన్స్ కొనసాగుతుంది. అసలైతే లైన్ లో దృశ్యం 3 ఉంది. వెంకటేష్ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేయాలని మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో మోహన్ లాల్ తో రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
ఐతే దృశ్యం 3 తో పాటు వెంకటేష్ తో సినిమా చేయాలనే ప్లాన్ ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్ లో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ నుంచి టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల వరకు ఉన్నారు. వెంకటేష్ సినిమా ఓకే చేయాలంటే అదంత ఈజీగా జరిగే పని కాదు. వెంకటేష్ తో సినిమా అంటే ముందు సురేష్ బాబు కథ ఓకే చేయాలన్న టాక్ ఉంది. ఐతే కొన్ని స్టోరీస్ సురేష్ బాబు కాదన్నా సరే వెంకటేష్ రిస్క్ చేసి సక్సెస్ అందుకున్నారు.
శైలేష్ కొలనుతో వెంకటేష్ చేసిన సైంధవ్..
యువ దర్శకులతో వెంకటేష్ పనిచేయాలని అనుకుంటున్నారట. ఐతే శైలేష్ కొలనుతో వెంకటేష్ చేసిన సైంధవ్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్ అయితే మరికొన్ని ప్రయోగాలు వెంకటేష్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఆ సినిమా రిజల్ట్ వెంకటేష్ ని కూడా డిజప్పాయింట్ చేసింది. అందుకే స్టోరీ సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
వెంకటేష్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే చాలు అదే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చి పెడుతుంది. సో వెంకీ మామ త్రివిక్రం తర్వాత ఎవరితో సినిమా చేస్తాడో తెలియదు కానీ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే రాబోతున్నారని మాత్రం అర్థమవుతుంది. త్రివిక్రం సినిమా పూర్తయ్యే సరికి వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన కథలను వింటూ సరైన స్టోరీ పిక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
