Begin typing your search above and press return to search.

వెంకీ వెనక్కి తగ్గితే మంచి నిర్ణయమే

ఇండియాలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమాల్లో ఆల్ టైం బెస్ట్ లిస్ట్ తీస్తే ‘దృశ్యం’ ముందు వరసలో ఉంటుంది. ప‌న్నెండేళ్ల ముందు విడుద‌లై అప్ప‌టికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అన్ని రికార్డుల‌నూ బ‌ద్ద‌లు కొట్టేసింది.

By:  Garuda Media   |   25 Feb 2026 4:00 AM IST
వెంకీ వెనక్కి తగ్గితే మంచి నిర్ణయమే
X

ఇండియాలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమాల్లో ఆల్ టైం బెస్ట్ లిస్ట్ తీస్తే ‘దృశ్యం’ ముందు వరసలో ఉంటుంది. ప‌న్నెండేళ్ల ముందు విడుద‌లై అప్ప‌టికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అన్ని రికార్డుల‌నూ బ‌ద్ద‌లు కొట్టేసింది. ఆ త‌ర్వాత హిందీ, తెలుగు, త‌మిళం.. ఇలా ప‌లు భాష‌ల్లో విడుద‌లై అన్ని చోట్లా సూప‌ర్ హిట్ట‌య్యాయి. చైనీస్, సింహ‌ళీస్ లాంటి విదేశీ భాష‌ల్లోనూ ఈ మూవీ రీమేక్ అయి విజయవంతం అయింది. దీనికి కొన‌సాగింపుగా మోహ‌న్ లాల్- జీతు తీసిన దృశ్యం-2 కొవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై అద్భుత స్పంద‌న తెచ్చుకుంది. ఇప్పుడు మలయమాళంలో మూడో భాగం కూడా రెడీ అయిపోయింది. ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ సినిమాను తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ రూపొందించాల‌ని అనుకున్నాడు జీతు జోసెఫ్‌. కానీ హిందీలో దృశ్యం, దృశ్యం-2 తీసిన ద‌ర్శ‌కుడితోనే అజ‌య్ దేవ‌గ‌ణ్‌ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. మల‌యాళ వెర్ష‌న్ రిలీజ్ కాకుండా హిందీ వెర్ష‌న్ విడుద‌ల చేయ‌డానికి వీల్లేద‌ని జీతు కండిష‌న్ పెట్టడంతో దాన్ని అక్టోబరులో రిలీజ్ చేయబోతున్నారు.

కానీ తెలుగు వెర్షన్ సంగతేంటన్నదే ఇప్పటిదాకా తేలలేదు. విక్టరీ వెంకటేష్‌తో సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. జీతునే డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 2న మలయాళ వెర్షన్ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. అది బాగుంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు ఆదరణ దక్కడం ఖాయం. థియేటర్లలో కంటే ఓటీటీలో స్పందన ఇంకా బాగుంటుందనడంలో సందేహం లేదు. కథ రివీలైపోతుంది. సినిమాను చాలామంది చూసేస్తారు. అలాంటపుడు తెలుగులో మళ్లీ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ‘దృశ్యం-2’ విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా కనీసం ఓటీటీలో రిలీజైంది కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. దీనికంటే మలయాళ వెర్షన్‌కు తెలుగు డబ్బింగ్ జోడిస్తే సరిపోతుంది. ఇదే ఉద్దేశంతో ఇప్పుడు వెంకీ ఈ సినిమా పట్ల అనాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగు దృశ్యం-3 క్యాన్సిల్ అయినట్లే చెబుతున్నారు. ప్రస్తుతం వెంకీ ఫోకస్ త్రివిక్రమ్ మూవీ మీద ఉంది. దాని తర్వాత అనిల్ రావిపూడి సినిమాచేయాల్సి ఉంది. కాబట్టి దృశ్యం-3 చేయడం సందేహమే అంటున్నారు. వెంకీ ఈ నిర్ణయానికి కట్టుబడితే మంచిదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.