Begin typing your search above and press return to search.

దసరాకు వస్తే హిట్టే.. మరి ఈసారి?

టాలీవుడ్‌ లో కొంతమంది హీరోలకు కొన్ని సీజన్లతో స్పెషల్ రిలేషన్ ఉంటుంది.

By:  M Prashanth   |   21 Sept 2026 8:30 AM IST
దసరాకు వస్తే హిట్టే.. మరి ఈసారి?
X

టాలీవుడ్‌ లో కొంతమంది హీరోలకు కొన్ని సీజన్లతో స్పెషల్ రిలేషన్ ఉంటుంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ కు సంక్రాంతి అలాంటి సీజన్ అయితే.. దసరా కూడా కలిసొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల సినీ జర్నీలో ఆయన దసరా సమయంలో చాలా తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ వచ్చిన ప్రతిసారీ బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపించారు. ఇప్పుడు మరోసారి దసరా సీజన్‌ లో వెంకీ సినిమా రాబోతుండటంతో ఆ సెంటిమెంట్‌ పై చర్చ మొదలైంది.

వెంకటేష్ ఇప్పటివరకు దసరా సీజన్‌ ను టార్గెట్ చేస్తూ నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో ఎక్కువ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో దసరా సీజన్ కూడా వెంకీకి కలిసొచ్చే టైమ్‌ గా మారింది. 2000లో వచ్చిన జయం మనదేరా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అక్టోబర్‌ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

వెంకటేష్ కెరీర్‌ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్, ఎమోషన్‌ తో సాగిన ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు బాగానే రప్పించింది. ఆ తర్వాత 2007లో తులసితో మరోసారి దసరా బరిలోకి దిగారు వెంకటేష్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా యాక్షన్‌ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వచ్చింది. దసరా సెలవులను క్యాష్ చేసుకున్న ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 2008లో చింతకాయల రవితో మరోసారి ఇదే సీజన్‌ లో సందడి చేశారు.

ఆ సినిమా గత రెండు చిత్రాల రేంజ్ లో విజయం సాధించకపోయినా.. ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఇలా దసరా సీజన్‌లో వెంకటేష్‌ కు వచ్చిన సినిమాలను చూస్తే.. ఎక్కువ సందర్భాల్లో మంచి రిజల్ట్సే కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాపై కూడా ఆ సెంటిమెంట్ చర్చగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం ఈసారి దసరా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కుటుంబ కథతో పాటు యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది.

ముందు అక్టోబర్ 2న విడుదల చేయాలనే ఆలోచన ఉండగా.. దసరా సెలవులను యూజ్ చేసుకునేలా పండుగ వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై హైప్ పెంచింది. త్రివిక్రమ్ డైలాగ్స్, వెంకటేష్ యాక్టింగ్ కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. పైగా దసరా సీజన్ వెంకీకి గతంలో మంచి రిజల్ట్స్ ఇచ్చిన సందర్భాలు ఉండటంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

అయితే గత రికార్డులు కొత్త సినిమాకు విజయాన్ని ఫిక్స్ చేయవని చెప్పాలి. ఈసారి కథ, కామెడీ, వెంకటేష్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌ తో పాటు దసరా సెలవులను సినిమా ఎంతవరకు యూజ్ చేసుకుంటుందనేదే మెయిన్. గతంలో దసరా సెంటిమెంట్‌ ను సక్సెస్‌ గా మార్చుకున్న వెంకీ.. ఈసారి ఆదర్శ కుటుంబంతో ఆ జోష్ ను కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.